చైనా కొత్త యుద్ధ విమానం గుట్టు రట్టు! | Stealth Fighter J-20 first public flight demonstration | Sakshi
Sakshi News home page

చైనా కొత్త యుద్ధ విమానం గుట్టు రట్టు!

Published Mon, Oct 31 2016 3:13 PM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

చైనా కొత్త యుద్ధ విమానం గుట్టు రట్టు!

చైనా కొత్త యుద్ధ విమానం గుట్టు రట్టు!

ఝుహై: చైనా సరికొత్త యుద్ధ విమానం జే-20 స్టీల్త్‌ ఫైటర్‌ త్వరలోనే ప్రజల ముందుకు రానుంది. ఇన్నాళ్లు రహస్యంగా రూపొందిస్తున్న ఈ యుద్ధవిమానాన్ని ఝూహై ఎయిర్‌షోలో ప్రదర్శించనున్నట్టు చైనా వెల్లడించింది. అమేయ సైనిక శక్తిగా ఎదగాలనుకుంటున్న చైనా అత్యాధునిక టెక్నాలజీతో ఈ సరికొత్త యుద్ధవిమానాన్ని రూపొందించింది. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆసక్తిగా గమనిస్తున్న ఈ యుద్ధ విమానం మొట్టమొదటిసారి బహిరంగంగా ఆకాశంలో ప్రయాణించనుందని చైనా ప్రభుత్వ విమానాయాన కంపెనీ ఏవిక్‌ అధ్యక్షుడు టాన్‌ రుయిసంగ్‌ తెలిపారు. 20 ఏళ్ల కిందట వైమానిక సాంకేతికత విషయంలో చైనా ఎంతో వెనుకబడి ఉందని, కానీ నేడు ఈ రంగంలో అగ్రశ్రేణితో ముందంజలో ఉందని ఆయన చెప్పారు.

సత్వరంగా రహస్యంగా దూసుకెళ్లగలిగే ఈ యుద్ధవిమానం సుదూరస్థాయి క్షిపణులను అవలీలగా మోసుకెళ్లగలుతుంది. ఈ యుద్ధ విమానంతో ఆసియాలో సూపర్‌ పవర్‌గా తనను తాను చాటుకోవడానికి, గగనతల సామర్థ్యంలో అమెరికాకు ఏమాత్రం తీసిపోమని తెలుపడానికి చైనా తహతహలాడుతోంది. తన సరిహద్దులను రక్షించుకోవడమే కాదు.. వనరులతో సుసంపన్నమైన దక్షిణ చైనా సముద్రంలో తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి సైనికంగా తనను ఎవరూ ఎదుర్కోలేరనే సందేశాన్ని చైనా ఇవ్వాలనుకుంటోంది. అందులో భాగంగానే తన సైనిక శక్తిని అత్యంత వేగంగా అత్యాధునికరించుకొని తన బలాన్ని చాటుతోంది. దక్షిణాది నగరమైన ఝుహైలో ప్రతి రెండేళ్లకు ఓసారి నిర్వహిస్తున్న వైమానిక ప్రదర్శనలో తన మిలిటరీ సాంకేతికతను, యుద్ధ విమానాలను ప్రదర్శిస్తున్నది. ఈసారి ఈ వైమానిక ప్రదర్శనలో 42 దేశాలకు చెందిన 151 యుద్ధవిమానాలను కూడా ప్రదర్శించనున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement