బర్త్‌డేనాడు రైలు బోగీపై సెల్ఫీ.. అంతలోనే ! | Student died on the train with take selfie in Chennai | Sakshi
Sakshi News home page

బర్త్‌డేనాడు రైలు బోగీపై సెల్ఫీ.. అంతలోనే !

Published Thu, Aug 31 2017 8:32 PM | Last Updated on Sun, Sep 17 2017 6:12 PM

బర్త్‌డేనాడు రైలు బోగీపై సెల్ఫీ.. అంతలోనే !

బర్త్‌డేనాడు రైలు బోగీపై సెల్ఫీ.. అంతలోనే !

చెన్నై: యువత సెల్పీ మోజులో పడి ప్రాణాలను సైతం లెక్కచేయట్లేదు. స్నేహితులతో సరదగా గడిపాడు. అగివున్న రైలును చూశాడు. రైలు బోగీపైకి ఎక్కి సెల్పీ తీసుకుంటూ ఓ విద్యార్థి విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు. చెన్నై తాంబరం రైల్వే క్వార్టర్స్‌కు చెందిన మారిముత్తు కుమారుడు దిలీపన్‌(18). ప్రైవేట్‌ ట్యూటోరియల్లో ప్లస్‌టు చదువుతున్నాడు. ఆగస్టు 26వ తేదీన తన పుట్టిన రోజును జరుపుకున్న ఇతడు మిత్రులతో కలిసి రైల్వేస్టేషన్‌కు వెళ్ళాడు. అక్కడ ఆగి ఉన్న ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీపై ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు.

ఆ సమయంలో బోగీపై వెళుతున్న హై ఓల్టేజ్‌ తీగను అతడు గమనించలేదు. దానికి దిలీపన్‌ తాకటంతో షాక్‌కు గురై దూరంగా విసిరివేయబడ్డాడు. తీవ్రంగా గాయపడిన దిలీపన్‌ను మిత్రులు సమీపంలో గల ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించటంతో కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న అతను గురువారం ఉదయం మృతి చెందాడు. దీనిపై తాంబరం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement