ఏడవ తరగతి విద్యార్థి హోమ్ వర్క్ చేయక, టీచర్ దండిస్తారేమోనన్న భయంతో కిడ్నాప్ నాటకం ఆడాడు.
మోత్కూరు (నల్లగొండ): ఏడవ తరగతి విద్యార్థి హోమ్ వర్క్ చేయక, టీచర్ దండిస్తారేమోనన్న భయంతో కిడ్నాప్ నాటకం ఆడాడు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన ఓ విద్యార్థి బుధవారం ఉదయం స్కూల్‌కు వెళుతున్నానని చెప్పి కనిపించకుండా పోయాడు.
తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో తప్పిపోయిన విద్యార్థిని మోత్కూరులో గుర్తించారు. విచారించగా... తనను, తన స్నేహితుడ్ని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకొచ్చారని చెప్పాడు. తన స్నేహితుడు వెనక్కి వెళ్లిపోయాడని, సంబంధం లేని మాటలు చెబుతుండడంతో కిడ్నాప్ డ్రామాగా తేల్చారు. హోమ్‌వర్క్‌కు భయపడే ఇలా కట్టుకథ చెబుతున్నట్టు భావించిన పోలీసులు విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగించారు.