మీరట్: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ ప్రాథమిక పాఠశాలలో దారుణం జరిగింది. కొందరు ఆకతాయిలు స్కూలు విద్యార్థులతో బలవంతంగా అల్కాహాల్ తాగించారు. ఈ విషయం తెలియగానే పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు షాకయ్యారు. కాగా ఫిర్యాదు చేసిన విద్యా శాఖ అధికారులు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మీరట్లో తారాపురి ప్రాథమిక పాఠశాల జూదరులు, తాగుబోతులకు అడ్డాగా మారింది. కొందరు యువకులు పాఠశాల గదుల తలుపులను పగలగొట్టి అసాంఘిక కార్యకలపాలకు అడ్డాగా మార్చుకున్నారు. అంతేగాక స్కూలు పిల్లలను వేధిస్తున్నారు. ఇటీవల కొందరు విద్యార్థులతో బలవంతంగా మద్యం తాగించారు. పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయంది. పోలీసులు మొక్కుబడిగా పాఠశాలను సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు కానీ నిందితులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. విద్యాశాఖ కూడా ఈ ఘటనపై స్పందించలేదు.
పాపం.. స్కూల్ విద్యార్థులపై దారుణం
Published Wed, Aug 10 2016 3:43 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
Advertisement
Advertisement