మోడీ క్లీన్‌చిట్‌పై దాఖలైన పిటిషన్ తిరస్కరణ
న్యూఢిల్లీ: గుజరాత్‌లో 2002లో జరిగిన మతఘర్షణల కేసులో ఆ రాష్ట్ర సీఎం మోడీకి ప్రత్యేక దర్యాప్తు బందం(సిట్) క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అలాగే, నాటి అల్లర్లపై విచారణకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులతో తిరిగి సిట్‌ను ఏర్పాటు చేయాలని, వారిలో మైనారిటీ కమ్యూనిటీ నుంచి ఒకరు ఉండాలన్న పిటిషనర్ అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. ఈ స్థితిలో సిట్‌ను ఏర్పాటు చేయడం మంచిది కాదని జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డేలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
దీంతో అనుమతిస్తే తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటానని ధర్మాసనానికి న్యాయవాది ఫాతిమా విజ్ఞప్తి చేయగా... అందుకు ధర్మాసనం అనుమతించింది. 2002నాటి అహ్మదాబాద్ గుల్‌బర్గ్ సొసైటీ ఘర్షణల కేసులో దర్యాప్తు జరిపిన సుప్రీంకోర్టు నియమిత సిట్ మోడీ సహా మరికొందరికి క్లీన్‌చిట్ ఇస్తూ 2012 మార్చిలో సుప్రీంకోర్టుకు తుది నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే.