
తలసానిని బర్తరఫ్ చేయాలి
ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించాలి: ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, తిరిగి ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించాలని టీడీపీ ఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, రాజీనామా చేయకుండా మరో పార్టీలో మం త్రిగా కొనసాగడం దేశంలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తలసాని రాజీనామా చేశారని కేసీఆర్ గవర్నర్‌ను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై గవర్నర్, సీఎం సమాధానం చెప్పాలన్నారు. ‘దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గె లువ్. నీకు గులాంగిరీ చేస్తా..’ అని తలసానికి సవాలు విసిరారు.
టీఆర్‌ఎస్‌వి దిగజారుడు ఆలోచనలు
తెలంగాణలో తమకు రాజకీయ ప్రత్యర్థులు ఎవరూ ఉండకూడదని టీఆర్‌ఎస్ నాయకత్వం దిగజారుడు ఆలోచనలతో కుట్రలు చేస్తోందని తెలంగాణ టీడీపీ ఎమెల్యేలు మాగంటి గోపీనాథ్, వివేక్, అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు శోభ మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన తలసాని శ్రీనివాసయాదవ్ శాసన సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే మంత్రివర్గంలో చేరి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు.