టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ పార్టీలోకి ఫిరాయింపులకు పాల్పడుతున్నారని, వారిపై చర్య తీసుకోవాలని టీడీపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టులో
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ పార్టీలోకి ఫిరాయింపులకు పాల్పడుతున్నారని, వారిపై చర్య తీసుకోవాలని టీడీపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టులో ఉపసంహరించుకున్నారు. దీనికి సుప్రీంకోర్టు సమ్మతించింది.
తెలంగాణలో శాసనసభ్యులు పార్టీ ఫిరాయించడంపై ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎర్రబెల్లి దయాకర్‌రావులు దాఖలు చేసిన పిటిషన్లు సోమవారం జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి పిటిషన్‌లో ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతి కోరారు. అయితే ఎర్రబెల్లి పిటిషన్ ఉపసంహరించుకోవడంతో ఇంప్లీడ్ అయ్యే అవకాశం లేకుండా పోయింది. విచారణ అక్టోబరు 19కి వాయిదా వేసింది.