చంద్రబాబు ఆంధ్రాకే... : ఎర్రబెల్లి
టీఆర్‌ఎస్‌లో చేరికపై ఎమ్మెల్యే ఎర్రబెల్లి
రాయపర్తి: బంగారు తెలంగాణలో భాగస్వామిని అయ్యేందుకే టీఆర్‌ఎస్‌లో చేరానని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం మండల కేం ద్రంలోని మంచినీళ్ల చెరువు, మండలంలో రాగన్నగూడెంలోని నాగిరెడ్డిచెరువు, ఊకల్‌లోని నాగులకుంట చెరువుల్లో మిషన్ కాకతీయ పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా పాలకుర్తికి మొదటి దశలోనే ఇంటిం టికి తాగునీరు అందిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. అందులో భాగంగానే టీఆర్‌ఎస్‌లో చేరానన్నారు. టీడీపీలో ఉన్నపుడు నియోజకవర్గ అభివృద్ధికి ఒక్కపని కూడా కాలేదని తెలిపారు. రాష్ర్టంలో టీడీపీని బతికించుకుందామని ఎంతో ప్రయత్నం చేశానని, కానీ చంద్రబాబు ఆంధ్రా టీడీపీని మాత్రమే చూసుకుంటున్నారన్నారు. అందుకే తెలంగాణలో ఆ పార్టీకి మనుగడ లేదన్నారు. పాలకుర్తి నుంచి అన్నారం వరకు డబుల్‌రోడ్డు ప్రతిపాదనను సీఎం దృష్టికి తీసుకెల్లినట్లు చెప్పారు. అనంతరం ఊకల్ గ్రామంలో నిర్మిస్తున్న సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుగులోతు విజయ, జెడ్పీటీసీ వంగా ల యాకమ్మ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఎం.డీ ఉస్మాన్, రెంటాల గోవర్ధన్‌రెడ్డి, బొడ్డు రంగయ్య, ఉందాటి సురేష్, కంది ప్రభాకర్, నార్లపురం సునిత, ఉందాటి సతీష్, తదితరులు పాల్గొన్నారు.