తండ్రి హత్యలు చేస్తుంటే కూతురు డబ్బులిస్తోంది! | TDP leaders Comments on CM kcr, MP kavitha | Sakshi
Sakshi News home page

తండ్రి హత్యలు చేస్తుంటే కూతురు డబ్బులిస్తోంది!

Published Sat, Oct 17 2015 3:08 AM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM

తండ్రి హత్యలు చేస్తుంటే కూతురు డబ్బులిస్తోంది! - Sakshi

తండ్రి హత్యలు చేస్తుంటే కూతురు డబ్బులిస్తోంది!

రైతు ఆత్మహత్యలపై టీడీపీ నేతల ధ్వజం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బతుకమ్మలు ఆడటానికి, వాటర్‌గ్రిడ్‌కు, మిషన్ కాకతీయకు వేల కోట్లుంటాయి గానీ ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి మాత్రం ప్రభుత్వం వద్ద డబ్బు లేదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ టీడీపీ ప్రతినిధి బృందం ధ్వజమెత్తింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీనియర్ నేతలు యర్రబెల్లి దయాకర్‌రావు, రావుల చంద్రశేఖరరెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తండ్రి (కేసీఆర్) హత్యలు చేస్తుండగా, కూతురు (కవిత) డబ్బులిస్తోందని రైతు ఆత్మహత్యలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఈ నెల 19న గన్‌ఫౌండ్రీ వద్ద ధర్నా చేయనున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement