యువతి ప్రాణం తీసిన 'స్పెషల్ సెల్ఫీ' | Teen killed while trying to take the ultimate selfie | Sakshi
Sakshi News home page

యువతి ప్రాణం తీసిన 'స్పెషల్ సెల్ఫీ'

Published Thu, May 14 2015 4:39 PM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM

యువతి ప్రాణం తీసిన 'స్పెషల్ సెల్ఫీ'

యువతి ప్రాణం తీసిన 'స్పెషల్ సెల్ఫీ'

లాసి: ఫేస్ బుక్ లో స్పెషల్ సెల్ఫీ పోస్టు చేయాలని చేసిన సాహసం ఓ యువతి ప్రాణాలు తీసింది. ఉత్తర రొమేనియాలోని లాసి పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఆశ్చర్యకర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

అన్నా ఉర్సూ(18) అనే యువతి ప్రత్యేక సెల్ఫీ తీసుకుని ఫేస్ బుక్ లో పోస్ట్ చేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా దగ్గరలోని రైల్వేస్టేషన్ కు వెళ్లింది. రైలు పైకి ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె కాలు హైవోల్టేజ్ కరెంట్ వైర్లకు తాకడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

తీవ్రగాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమెను కాపాడేందుకు ఓ ప్రయాణికుడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. రైలు పైకి ఎక్కొద్దని హెచ్చరించినప్పటికీ అన్నా ఉర్సూ వినిపించుకోలేదని సదరు ప్రయాణికుడు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement