టీనేజి యువతిపై అత్యాచారం.. హత్య | Teenaged girl raped and murdered; finance firm's manager held | Sakshi
Sakshi News home page

టీనేజి యువతిపై అత్యాచారం.. హత్య

Published Mon, Nov 4 2013 10:20 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

Teenaged girl raped and murdered; finance firm's manager held

తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో గల తిరుపూర్లో ఓ టీనేజి యువతిపై అత్యాచారం చేసి ఆమెను హతమార్చారు. ఈ కేసులో పొల్లాచ్చి జిల్లాలోని ఓ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ను అరెస్టు చేశారు. అరుణ్ కుమార్ అనే ఆ వ్యక్తి 17 ఏళ్ల అమ్మాయి వెల్లియంపాల్యంలోని తన ఇంట్లో ఒంటరిగా ఉండగా ఆమెపై అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో ఆ యువతి గట్టిగా అరిచేందుకు ప్రయత్నించడంతో అతడు ఆమె గొంతు నొక్కేశాడని, దాంతో ఆమె ఊపిరాడక మరణించిందని పోలీసులు చెప్పారు. నిందితుడు అక్కడి నుంచి పారిపోబోతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడిని పోలీసులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా, అతడిని కస్టడీకి పంపుతూ రిమాండు విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement