సాక్షి,హైదరాబాద్: ‘ప్రత్యేక రాష్ట్రం వస్తే ఆర్నెల్లలో బంగారు తెలంగాణ చేసి చూపెడతామన్నారు. బంగారు తెలంగాణ కాదు కదా.. జ్వరం వస్తే రూ.ఐదారు లక్షల మేర ఖర్చు చేయాల్సి వస్తోంది. డబ్బులు లేని అట్టడుగువర్గాలకు చావే దిక్కవుతోంది. ప్రభుత్వ ముందుచూపు లోపం, నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం మూలంగా అనారోగ్యాలతో తెలంగాణ అల్లాడుతోంది. ముఖ్యమంత్రి తక్షణం స్పందించాల్సిందే’నంటూ పీసీసీ ముఖ్యనేతలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్,బండారి రాజిరెడ్డి, క్యామ మల్లేశ్‌లు డిమాండ్ చేశారు.
శుక్రవారం గాంధీఆస్పత్రిని సందర్శించి వివిధ వార్డుల్లో పరిస్థితిని పరిశీలించారు. వైద్యులు,రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు రోగులు తమకు మేలైన వైద్యం అందడం లేదని, పరీక్షల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోందని, కొన్ని రకాల మందులు బయట కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు.ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి,శ్రీశైలంగౌడ్‌లు విలేకరులతో మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం స్పందించాలని లేనట్లయితే రాష్ట్రంలో డెంగీ,స్వైన్‌ఫ్లూతో సాధారణ జనం ఇబ్బందిపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అనారోగ్యాలతో తెలంగాణ అల్లాడుతోంది
Published Sat, Sep 19 2015 2:28 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement