లోక్సభ డిప్యూటీ స్పీకర్ గా అన్నాడీఎంకే నాయకుడు ఎం. తంబిదురై ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు.
న్యూఢిల్లీ: లోక్సభ డిప్యూటీ స్పీకర్ గా అన్నాడీఎంకే నాయకుడు ఎం. తంబిదురై ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవికి తంబిదురై మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.
ఆయనకు మద్దతుగా బీజేపీ సీనియర్ నాయకులు ఎల్ కే అద్వానీ, రాజ్నాథ్ సింగ్, సుష్వా స్వరాజ్ తదితరులు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. కాంగ్రెస్ నాయకులతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఎం. వెంకయ్య నాయుడు చర్చలు జరిపి లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి ప్రయత్నం చేశారు.