‘పొగ’తో వయసుకు ‘సెగ’
అతిగా మద్యం తాగినా అదే సమస్య
వాషింగ్టన్: ధూమపానం... మద్యం వంటి అలవాట్లు ఉన్నవారికి ఇది చేదు వార్తే. పొగ తాగినా... అతిగా ‘పెగ్గు’ బిగించినా ముందుగానే వృద్ధాప్యపు లక్షణాలు వచ్చేస్తాయట! అయితే రోజుకు ఒకటి, రెండు పెగ్గుల మద్యం తీసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదట. పైగా ఆరోగ్యకరం కూడా అంటోంది ఓ సరికొత్త అధ్యయనం. డీఎన్‌ఏలో జన్యుపరమైన మార్పులు జరిగి శరీరంపై ప్రభావం చూపుతుందని ఈ పరిశోధనలో వెల్లడైంది. అయితే ఏ స్థాయిలో ధూమపానమైనా జీవసంబంధ మార్పులకు కారణమవుతుందని అధ్యయనం చేసిన అమెరికా అయోవా యూనివర్సిటీ శాస్త్రవేత్త రాబర్ట్ ఎ ఫిల్‌బెర్ట్ పేర్కొన్నారు. బాల్టిమోర్‌లో ఇటీవల జరిగిన అమెరికన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ జెనెటిక్ వార్షిక సమావేశంలో ఈ అధ్యయన పత్రాలను సమర్పించారు.