ఇల్లు గుల్ల చేయబోయి గుర్రుపెట్టి నిద్రపోయాడు | Theft sleep at Home..! | Sakshi
Sakshi News home page

ఇల్లు గుల్ల చేయబోయి గుర్రుపెట్టి నిద్రపోయాడు

Published Thu, Feb 25 2016 1:20 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

ఇల్లు గుల్ల చేయబోయి గుర్రుపెట్టి నిద్రపోయాడు - Sakshi

ఇల్లు గుల్ల చేయబోయి గుర్రుపెట్టి నిద్రపోయాడు

చెన్నై, సాక్షి ప్రతినిధి: చోరకళకు కొత్తనో.. లేక వరుస చోరీలతో అలసిపోయాడో కానీ.. చోరీ చేసిన ఇంటిలోనే హాయిగా నిద్రపోయి పోలీసులకు దొరికిపోయాడో దొంగ. చెన్నై శివారులోని రాజకీళ్‌పాక్కంలో బాలమురుగున్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతను రెండు రోజుల క్రితం కుటుంబసభ్యులతో కలసి తిరువణ్ణామలైలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. బాలమురుగన్ మాత్రం ఉద్యోగానికి వెళ్లేందుకు బుధవారం ఉదయం ఇంటికి వచ్చాడు. తాళం తీసుకొని లోపలికి వెళ్లగా హాలులో ఉండాల్సిన టీవీ, డీవీడీ ప్లేయర్ తదితర విలువైన వస్తువులు కనపడలేదు.

దీంతో ఆందోళనకు గురైన బాలమురుగన్ వస్తువులను వెతుక్కుంటూ పడకగదిలోకి వెళ్లగా ఓ యువకుడు గుర్రుపెట్టి నిద్రపోతూ కనిపించాడు. అతని పక్కనే రెండు మూటల్లో సామగ్రి ఉంది. దీంతో బాలమురుగన్ నెమ్మదిగా బైటకు వచ్చి ఇంటికి తాళం వేసి పోలీసులకు సమాచారమందించాడు. ఆ పోలీసులు వచ్చి లేపితే కాని ఆ దొంగకు మెళకువ రాలేదు. అతన్ని ప్రశ్నించగా తన పేరు కార్తీ (27) అని, దొంగతనానికి వచ్చానని ఒప్పుకున్నాడు. నిందితుణ్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement