రెస్టారెంట్లో బాంబు పేలుడు: ముగ్గురు మృతి | Three killed in Afghan restaurant blast | Sakshi
Sakshi News home page

రెస్టారెంట్లో బాంబు పేలుడు: ముగ్గురు మృతి

Published Thu, Nov 21 2013 9:32 AM | Last Updated on Thu, Mar 28 2019 6:08 PM

Three killed in Afghan restaurant blast

తాలిబాన్ తీవ్రవాదుల కంచుకోట కందహార్ ప్రావెన్స్లోని ఓ రెస్టారెంట్లో బాంబు పేలుడు సంభవించి ముగ్గురు మరణించారు. ఆ ఘటనలో మరో 14 మంది గాయపడ్డారని ప్రభుత్వ అధికార ప్రతినిధి గురువారం ఇక్కడ వెల్లడించారు. బాంబు పేలుడు సంభవించిన సమయంలో రెస్టారెంట్లో చాలా మంది ఉన్నారని తెలిపారు.

 

విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశ్యంతోనే ఆ బాంబు పేలుడు జరిగిందని అధికార ప్రతినిధి అభిప్రాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. అయితే ఆ బాంబు పేలుడుకు తామే బాధ్యులమంటూ ఇంతవరకు ఎవరు ప్రకటించలేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement