14 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు | Tirumala brahmotsavam starts october 14th 2015 | Sakshi
Sakshi News home page

14 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

Published Fri, Oct 9 2015 1:32 PM | Last Updated on Wed, Sep 18 2019 3:21 PM

14 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు - Sakshi

14 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుమల: కలియుగదైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 నుండి 22 వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని తిరుమలతిరుపతి దేవస్థానం జేఈవో కె. శ్రీనివాసరాజు వెల్లడించారు. శుక్రవారం తిరుమలలో శ్రీనివాసరాజు విలేకరుతో మాట్లాడుతూ... ఈ బ్రహ్మోత్సవాలలో సామన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.

వృద్ధులు, చంటిపిల్లల దర్శనాలు రద్దు చేసినట్లు... అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కుదించినట్లు ఆయన వివరించారు. గరుడ వాహనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. రేపటి నుంచి పాఠశాలకు దసరా సెలవుల నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే 17వ తేది అర్దరాత్రి 12 గంటల నుండి 20వ తేది ఉదయం 10గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు అనుమతించనివ్వమని తిరుపతి పట్టణ ఎస్పీ గోపినాథ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement