కోటికి చేరిన ‘టీఎస్‌పీఎస్సీ’ విజిటర్లు | TSPC Visitors reached for one crores | Sakshi
Sakshi News home page

కోటికి చేరిన ‘టీఎస్‌పీఎస్సీ’ విజిటర్లు

Published Sat, Sep 12 2015 11:32 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

TSPC Visitors reached for one crores

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్‌సైట్‌ను సందర్శించిన వారి సంఖ్య కోటికి చేరింది. ఏప్రిల్‌లో ప్రారంభించిన ఈ వెబ్‌సైట్‌ను కేవలం ఐదు నెలల్లోనే ఇంతమంది సందర్శించడం గమనార్హం. అభ్యర్థులు ఉద్యోగ నోటిఫికేషన్లకు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా చైర్మన్ ఘంటా చక్రపాణి ‘వన్‌టైమ్ రిజిస్ట్రేషన్’ను ప్రారంభించడం, కొత్తగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల కావడమే దీనికి కారణం.

వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. ఆ సమాచారాన్నే అన్ని నోటిఫికేషన్లకు దరఖాస్తుగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు దాదాపు నాలుగు లక్షల మందికిపైగా వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement