చండీగఢ్: పంజాబ్ లో పాగా వేయాలని భావించి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రెండో స్థానానికి పరిమితమైంది. 20 స్థానాలు గెలిచి రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. 26 నియోజవర్గాల్లో ఆప్ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. 24 చోట్ల డిపాజిట్ కోల్పోయారు. కేజ్రీవాల్ పార్టీతో పొత్తు పెట్టుకున్న లోక్ ఇన్సాఫ్ పార్టీ రెండు చోట్ల పాగా వేసింది.
అయితే ఆప్ కంటే తక్కువ సీట్లు(15) గెలిచిన అకాలీదళ్ ఓట్ల శాతం పరంగా దానికంటే ముందుంది. ఆప్ కు 23.9 శాతం ఓట్లు రాగా, అకాలీదళ్ కు 25.3 శాతం ఓట్లు వచ్చాయి. 77 స్థానాలను కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఖాతాలో 38.5 శాతం ఓట్లు పడ్డాయి. 5 శాతం ఓట్లతో బీజేపీ మూడు సీట్లు దక్కించుకుంది. తమకు 100 వరకు సీట్లు వస్తాయని ఎన్నికలకు ముందు ఆప్ నేతలు దీమా వ్యక్తం చేయగం గమనార్హం.
రెండు డజన్ల మందికి డిపాజిట్ గల్లంతు
Published Mon, Mar 13 2017 2:21 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
Advertisement
Advertisement