
అందరికీ కృతజ్ఞతలు: ఉమ్మారెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపునకు మద్దతిచ్చి, విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు చెప్పారు. ప్రత్యేక హోదా కోసం చేస్తున్న బంద్ ప్రజా ఉద్యమం అని అన్నారు.
బంద్ను విఫలం చేయాలని అనుకోవడం అవివేకమని ఉమ్మారెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని ప్రజలు నినదిస్తున్నారని అన్నారు.