ఏపీ బడ్జెట్ ప్రసంగం పెరిగింది తప్ప... | Andhra pradesh budget is numbers magic, says MLC ummareddy | Sakshi
Sakshi News home page

ఏపీ బడ్జెట్ ప్రసంగం పెరిగింది తప్ప...

Published Thu, Mar 10 2016 4:12 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

ఏపీ బడ్జెట్ ప్రసంగం పెరిగింది తప్ప... - Sakshi

ఏపీ బడ్జెట్ ప్రసంగం పెరిగింది తప్ప...

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక బడ్జెట్ (2016-17) కేవలం అంకెల గారడీలా కనిపిస్తోందని ఎమ్మెల్సీ విమర్శించారు. గురువారం అసెంబ్లీ ముగిసిన తర్వాత ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ ప్రసంగం పెరిగింది తప్ప వృద్ధిరేటు పెరగలేదని వ్యాఖ్యానించారు. మసి పూసి మారేడుకాయ చేసి చూపించారని పేర్కొన్నారు.

వ్యవసాయ ఉత్పత్తులు తగ్గాయని చెప్పిన ప్రభుత్వం, వ్యవసాయ వృద్ధి పెరిగిందని ఎలా చెబుతుందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని బీజేపీ నేతలు చెబుతుండగా, రాష్ట్ర బడ్జెట్ లో కేంద్ర నిధుల వివరాలే పొందుపరచలేదన్న విషయాన్ని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి గుర్తుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement