తక్కువ ఉత్పత్తితో ఒరిగేదేమీ లేదు: కేల్కర్
న్యూఢిల్లీ: చమురు, గ్యాస్ ఉత్పత్తి వ్యయం పెరిగినా, ఉద్దేశపూర్వకంగా ఉత్పత్తిని తగ్గిం చినా సంబంధిత కంపెనీలకు ఒరిగేదేమీ లేదని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి విజయ్ కేల్కర్ సారథ్యంలోని నిపుణుల కమిటీ పేర్కొంది. ‘పెట్రోలియం ఉత్పత్తుల కోసం దిగుమతులపై ఆధారపడడాన్ని 2030 నాటికి తగ్గించుకోవడానికి రోడ్‌మ్యాప్’ అనే అంశంపై కేల్కర్ ప్యానెల్ రూపొందించిన నివేదికలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటివరకు చేస్తున్న వాదనను కమిటీ సమర్థించినట్లయింది. 2009 ఏప్రిల్‌లో కేజీ డీ6లో గ్యాస్ ఉత్పత్తి ప్రారంభం కాగా 2010 మార్చి నాటికి ఉత్పత్తి 69.43 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గరిష్ట స్థాయికి చేరింది. బావుల్లో నీరు, బురద రావడంతో తర్వాత ఉత్పత్తి భారీగా తగ్గింది. గత నెలలో ఉత్పత్తి 11 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లకు క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆర్‌ఐఎల్‌పై పలు విమర్శలొచ్చాయి.