మొదటిసారిగా మౌనాన్ని వీడిన కోహ్లి! | Virat Kohli comment on anil kumble resignation | Sakshi
Sakshi News home page

కుంబ్లే రిజైన్‌: మొదటిసారిగా మౌనాన్ని వీడిన కోహ్లి!

Published Thu, Jun 22 2017 8:04 PM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM

మొదటిసారిగా మౌనాన్ని వీడిన కోహ్లి!

మొదటిసారిగా మౌనాన్ని వీడిన కోహ్లి!

భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ పదవి నుంచి స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే వైదొలిగిన అనంతరం జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తొలిసారి నోరువిప్పాడు. కుంబ్లేకు, తనకు మధ్య జరిగినదాని గురించి మాట్లాడాడు. శుక్రవారం నుంచి వెస్టిండీస్‌ సిరీస్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అతను విలేకరులతో మాట్లాడాడు. కోహ్లితో విభేదాలు, అతని మంకుపట్టు వల్లే కుంబ్లే కోచ్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కోహ్లి మాత్రం 'కోచ్‌ పదవి నుంచి తప్పుకోవాలని అనిల్‌ భాయ్‌ నిర్ణయించారు. ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. ఆయన అభిప్రాయాలు ఆయన చెప్పారు' అంటూ తన మౌనాన్ని తొలిసారి వీడారు.

కుంబ్లే తప్పుకోవడానికి కారణం ఏమిటి? అసలు చాంపియన్‌ ట్రోఫీ సందర్భంగా డ్రెసింగ్‌ రూమ్‌లో ఏ జరిగిందన్న ప్రశ్నలకు కోహ్లి నేరుగా సమాధానం చెప్పలేదు. ఈ విషయంలో ఎన్నో ఊహాగానాలు చెలరేగుతున్నాయని, డ్రెసింగ్‌ రూమ్‌కు ఏమాత్రం సంబంధం లేనివాళ్లు ఈ ఊహాగానాలను వ్యాప్తి చేస్తున్నారని అన్నాడు. డ్రెసింగ్‌ రూమ్‌లో ఏం జరిగిందన్నది పూర్తిగా ప్రైవేటు వ్యవహారమని, అది జట్టు వ్యక్తిగత విషయమని, దాని గురించి బయటకు చెప్పలేనని పేర్కొన్నాడు. డ్రెసింగ్‌ రూమ్‌ గౌరవాన్ని, పవిత్రతను తాను కాపాడానని, తనెప్పుడూ గౌరవప్రదంగా వ్యవహరించినట్టు కోహ్లి చెప్పుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement