
'బీజేపీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు'
బెంగళూరు: మత అసహనాన్ని సహించబోమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సామ్యవాదంపై బీజేపీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. బీజేపీ మతతత్వ పార్టీ అని పునరుద్ఘాటించారు.
ప్రముఖ హేతువాది ఎంఎం కల్బుర్గీ హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మత అసహనంపై మాట్లాడేముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగిన దాడులపై చర్యలు చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.