విరాళాలు టీటీడీకి బదిలీ అయ్యేందుకు మాత్రమే: ఈవో సాంబశివరావు
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధార్మికపరమైన కార్యక్రమాలు తప్ప షేర్లు కొనడం, అమ్మడం చేయదని ఈవో దొండపా టి సాంబశివరావు తెలిపారు. మంగళవారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. శ్రీవారి హుం డీలో భక్తులు నగదు, బంగారం, వెండి, భూమి పత్రాలతోపాటు షేర్లు, సెక్యూరిటీ పత్రాలు సమర్పిస్తుంటారన్నారు. ఇందులో షేర్లు, సెక్యూరిటీ డిపాజిట్లు సులభంగా టీటీడీకి బదిలీ అయ్యేందుకు వీలుగా డీమ్యాట్ అకౌంట్ ప్రారంభించామన్నారు.
అదే అకౌంట్‌కు వచ్చే షేర్లు, సెక్యూరిటీ డిపాజిట్లతో తిరిగి షేర్లను కొనడం, అమ్మడం చేయమని ఈవో స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రారంభించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను దేశ వ్యాప్తంగా 2,500 పోస్టాఫీసుల్లో విక్రయించనున్నామని తెలిపారు.
డీమ్యాట్‌తో వ్యాపారం చేయం
Published Wed, Aug 5 2015 1:04 AM | Last Updated on Tue, Aug 28 2018 5:43 PM
Advertisement