జెన్కోనూ కోర్టుకు లాగుతాం: వైఎస్ జగన్ | will drag ap genco to court for higher compensation, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

జెన్కోనూ కోర్టుకు లాగుతాం: వైఎస్ జగన్

Published Mon, Sep 14 2015 2:47 PM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM

జెన్కోనూ కోర్టుకు లాగుతాం: వైఎస్ జగన్ - Sakshi

జెన్కోనూ కోర్టుకు లాగుతాం: వైఎస్ జగన్

తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రూ. 10 లక్షల వంతున పరిహారం ఇవ్వాలని, అలాగే క్షతగాత్రులకు రెండు లక్షల వంతున ఇవ్వాలని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రమాదం జరగడంలో ఏపీ జెన్కో, జెన్కో కాంట్రాక్టర్లది కూడా తప్పుంది కాబట్టి, పరిహారం ఇప్పించేందుకు కోర్టులో కేసు వేసి జెన్కోను కూడా కోర్టుకు లాగుతామని ఆయన హెచ్చరించారు. రాజమండ్రిలో ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ఏమన్నారంటే...

  • ఉపాధి పనులకు 30 నుంచి 80 రూపాయల వరకు కూడా గిట్టుబాటు కావడంలేదు
  • ఈ గ్రామాలలో ఉపాధిపనులు జరగక, బతుకుతెరువు గత్యంతరం లేని పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తోంది
  • పనులు చేసుకుని తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు ఏపీ జెన్కో పవర్ ప్లాంటు నుంచి ఫ్లై యాష్ సరఫరా చేసే వాహనంలో వచ్చారు
  • ఫ్లై యాష్ వేడిగా ఉంటుందని జెన్కు తెలుసు, కాంట్రాక్టరుకూ తెలుసు
  • అందులో మనుషులను ఎక్కించుకోవడం అన్యాయం
  • ఇందులో జెన్కో కాంట్రాక్టర్ది తప్పుంది
  • అర్ధరాత్రి దాటిన తర్వాత బండి బోల్తాపడి 19 మంది చనిపోయారు
  • మీకు పబ్లిసిటీ వస్తుందంటే పరిహారం 5 లక్షలు ఇస్తావు
  • మేకప్ చేసుకుని షూటింగ్ కోసం వెళ్లి మనుషులు చనిపోతే 10 లక్షలు ఇస్తావు
  • కూలీల కుటుంబంలో సంపాదించి పెట్టే కుటుంబపెద్ద చనిపోతే.. వాళ్లకు పరిహారం ఎందుకు తక్కువ ఇస్తావు
  • ఒక్క ఎమ్మెల్యే, మంత్రి వచ్చినా, బాధితుల కుటుంబ సభ్యులను కలవలేదు
  • ఈ ప్రమాదం సంభవించడంలో ప్రభుత్వం తప్పు కూడా ఉంది..
  • 2 లక్షల ఎక్స్గ్రేషియాతో వీళ్లు ఎలా బతుకుతారు?
  • ఇందులో జెన్కో తప్పు కూడా ఉంది కాబట్టి, వీళ్లకు కనీసం 10 లక్షల పరిహారం ఇవ్వాలి
  • దీనికోసం కోర్టులో కేసు వేస్తాం, జెన్కోను కూడా అందులోకి లాగుతాం
  • నేను వస్తున్నట్లు తెలిసి ఒక్కో వ్యానులో మూడు మృతదేహాలు పెట్టి నెట్టేశారట
  • నేను వస్తున్నానంటే ఎందుకంత భయం?
  • పిల్లలు ఇక్కడే ఉండగా వాళ్లకు ఇవ్వకుండా.. ఎందుకు పంపేశారు
  • చంద్రబాబు చేస్తున్న పనుల్లో ఇంతకన్నా దుర్మార్గం ఏమీ ఉండదు..
  • క్షతగాత్రులకు కూడా కేవలం ఆస్పత్రుల్లో ఫస్ట్ ఎయిడ్ చేసి పంపేయడం కాకుండా.. వాళ్లకు పూర్తి చికిత్సతో పాటు కనీసం లక్ష, రెండు లక్షల పరిహారం ఇవ్వాలి
  • ఈ ప్రభుత్వం ఇసుక నుంచి మట్టి వరకు అన్నీ గోల్మాలే, అన్నింటిలో చంద్రబాబు లంచాలే
  • ఈ ప్రభుత్వంలో ఉన్నంత అవినీతి మరే ప్రభుత్వంలో లేదు
  • చివరకు ఏపీ జెన్కోకు సరఫరా చేసే బొగ్గులో కూడా అవినీతే
  • మద్యం ఆదాయం పెంచుకోడానికి కొంతమందికే, తనకు లంచాలిచ్చిన వాళ్లకే అనుమతులు ఇచ్చారు
  • ప్రతి విషయంలో అవినీతి.. అవినీతి.. అవినీతి
  • లంచాలిస్తూ ఆడియో, వీడియో టేపులతో పట్టుబడితే ఆ కేసు నుంచి బయట పడేందుకు ప్రత్యేక హోదాను సైతం పణంగా పెట్టారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement