ఆగస్ట్ 15లోగా నివేదిక అందిస్తాం
స్వచ్ఛభారత్‌పై ఏర్పాటైన సీఎంల ఉపసంఘం
సాక్షి, బెంగళూరు: నీతి ఆయోగ్‌లో భాగంగా స్వచ్ఛ భారత్‌పై ఏర్పాటైన ముఖ్యమంత్రుల ఉపసంఘం ఆగస్టు 15లోగా కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఉపసంఘం 3వ సమావేశం బుధవారం ఇక్కడ జరిగింది. వ్యర్థ పదార్థాల నుంచి ఇంధనాన్ని తయారు చేసే ‘వేస్ట్ మేనేజ్‌మెంట్’, స్వచ్ఛ భారత్‌కు అనుబంధంగా సాంకేతిక మండలి ఏర్పాటుపై చర్చించారు. ‘తదుపరి సమావేశం ఢిల్లీలో జరుగుతుంది.
స్వాతంత్ర దినోత్సవంలోగా కేంద్రప్రభుత్వానికి నివేదిక సమర్పించలనుకుంటున్నాం’ అని భేటీ తర్వాత బాబు తెలిపారు. తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ‘ఓటుకు కోట్లు’ అంశంపై స్పందించేందుకు నిరాకరించారు. ఇక్కడ స్వచ్ఛభారత్‌పై తప్ప మరేమీ మాట్లాడనని అన్నారు. తర్వాత నగరంలోని శంకరమఠాన్ని సందర్శించారు. శృంగేరి శారదా పీఠం పీఠాధిపతి శ్రీభారతీ తీర్థ స్వామీజీని కలిసి, ఆశీస్సు అందుకున్నారు.