ఇన్ఫోసిస్ క్యాంపస్ లో మహిళపై అత్యాచారం | Woman allegedly raped in Infosys campus in Pune | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్ క్యాంపస్ లో మహిళపై అత్యాచారం

Published Tue, Dec 29 2015 12:55 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

ఇన్ఫోసిస్ క్యాంపస్ లో మహిళపై అత్యాచారం - Sakshi

ఇన్ఫోసిస్ క్యాంపస్ లో మహిళపై అత్యాచారం

పుణే: ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ లో మహిళ అత్యాచారానికి గురైంది. పుణేలోని ఇన్ఫోసిస్ ఫేజ్-1 క్యాంపస్ లో ఆదివారం ఈ దారుణం జరిగింది. ఈ నెల 27న హౌస్ కీపింగ్ సిబ్బందిలో ఇద్దరు తనపై అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

 

క్యాంటీన్ లో క్యాషియర్ గా పనిచేస్తున్న మహిళపై ఇద్దరు వ్యక్తులు అదే క్యాంటీన్ లో అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ సంఘటనపై పుణే ఇన్ఫోసిస్ వర్గాలు స్పందించాయి. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అలాగే క్యాంపస్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని వివరించాయి. అలాగే పోలీసుల విచారణకు తాము సహరిస్తామని పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement