వివాహిత రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రైల్వే ఫైఓవర్ వద్ద ఆదివారం ఉదయం జరిగింది.
ఏలూరు(పశ్చిమగోదావరి): వివాహిత రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రైల్వే ఫైఓవర్ వద్ద ఆదివారం ఉదయం జరిగింది. వివరాలు.. పెదపాడు మండలం పాత ముప్పర్రుకి చెందిన ముర్రాపు శ్వేత(24)కు అదే గ్రామానికి చెందిన రమేశ్(27)తో నాలుగేళ్ల కిందట వివాహమైంది.
ఆదివారం గుడికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకి వచ్చిన శ్వేత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.