railway flyover
-
మనుబోలు–గూడూరు మధ్య రైల్వే ఫ్లైఓవర్ ప్రారంభం
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ)/మనుబోలు: విజయవాడ డివిజన్లోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు–తిరుపతి జిల్లా గూడూరు మధ్య మూడవ రైల్వే లైను పనుల్లో భాగంగా గూడూరు సమీపంలోని పంబలేరు నదిపై రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) నిర్మించిన పొడవైన రైల్వే ఫ్లైఓవర్‌ను శుక్రవారం ప్రారంభించారు. మనుబోలు–గూడూరు మధ్య సుమారు 10 వరకూ కాలువలు, ఏర్లు ఉన్నాయి. వీటిలో గూడూరు సమీపంలోని పంబలేరు పెద్దది. దీంతో పాటు సమీపంలోని కొన్ని కాలువలను కలుపుకుని 2.2 కిలోమీటర్ల దూరంతో అతి పొడవైన రైల్వే ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఈ రైల్వే ఫ్లైఓవర్ దక్షణ మధ్య రైల్వేలో 7వ పెద్ద ఆర్వోఆర్గా నిలిచిందని రైల్వే అధికారులు తెలిపారు. జోన్లో అతి పొడవైన ఆర్వోఆర్ కూడా ఇదేనని పేర్కొన్నారు. దీని నిర్మాణంలో హైగ్రేడ్ కాంక్రీట్, స్ట్రక్చరల్ స్టీల్‌ను ఉపయోగించినట్లు తెలిపారు. ఈ సింగిల్ లైన్ వంతెన రెండు దిశలలో రైళ్ల కదలికల కోసం రూపొందించారు. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రైళ్ల రాకపోకలను సులభతరం చేయడానికి ఈ ఫ్లైఓవర్ ఉపకరిస్తుంది. ఈ ఫ్లైఓవర్ వల్ల గూడూరు స్టేషన్ మీదుగా విజయవాడ నుంచి రేణిగుంట, చెన్నై మధ్య ఏకకాలంలో నడిచే రైళ్ల రాకపోకలకు ఇక అంతరాయం ఉండదు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే ఫ్లైఓవర్‌ను నిరి్మంచడంలో కృషి చేసిన రైల్వే అధికారులు, ఆర్వీఎన్ఎల్ సంస్థ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. -
బాపూజీనగర్ బ్రిడ్జి సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
కాజీపేట : బాపూజీనగర్ క్రాస్‌రోడ్డులో ఉన్న రైల్వే ఫ్లైఓవర్ పక్కన మంగళవారం గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించినట్లు కాజీపేట సీఐ రమేష్‌కుమార్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. ప్లైఓవర్ పక్క నుంచి రైల్వేలైన్ దాటుతున్న స్థానికులు యువకుడి శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మొదట ఎవరో రోడ్డు పక్కన పడిపోయి ఉంటారనే ఉద్దేశంతో దగ్గరకు వెళ్లిచూడగా చనిపోయి ఉన్నాడు. మృతుడి వయస్సు 40 ఏళ్లు ఉండొచ్చని, చామనఛాయ రంగులో ఉండి ఎర్రని టీషర్ట్ వేసుకున్నట్లు చెప్పారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపర్చినట్లు చెప్పారు. మృతుడి వివరాలు తెలిసిన వారేవరైనా 94407-00506 నంబర్‌కు ఫోన్ చేయాలని సీఐ కోరారు. -
రైల్వే ఫ్లై ఓవర్‌కు మోక్షమెప్పుడో?
ఓదెల : నిత్యం వందలకొద్దీ రైళ్ల రాకపోకలు.. గంటల తరబడి గేట్ మూసివేత. ఫలితంగా మూడు మండలాల ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. కాజీపేట్-బల్లార్షా సెక్షన్ల మధ్య కొలనూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని లెవల్‌క్రాసింగ్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని ఏళ్లుగా వేడుకుంటున్నారు. వీరి విన్నపాలు ఎప్పటిలాగే బుట్టదాఖలు అవుతూనే ఉన్నారుు. కొలనూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని లెవల్‌క్రాసింగ్ గేట్ వద్ద 1982, మార్చిలో జయంతి జనతా ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ సర్వీసును ఢీకొట్టడంతో 50 మందికి పైగా అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఉలిక్కిపడ్డ దక్షిణమధ్య రైల్వే అప్పటికప్పుడే లెవల్ క్రాసింగుగేట్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అయితే ఇప్పటి వరకు రైల్వే ఫ్లైఓవర్‌ను మాత్రం నిర్మించలేదు. గంటలతరబడి ఎదురుచూపులు కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్, పెద్దపల్లి మండలాల ప్రయాణికులు కొలనూర్ లెవల్ క్రాసింగుగేట్ దాటి వెళ్లాల్సిందే. సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు కొలనూర్ రైల్వేస్టేషన్ మీదుగా వెళ్తుంటారుు. నిత్యం వందల సంఖ్యలో రైళ్లు పోతుండడంతో లెవల్ క్రాసింగుగేట్ గంటల తరబడిగా మూసి ఉంటుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను తరలించే 108, 104 వాహనాలు సైతం ఆగిపోతున్నాయి. ఎన్నో విన్నపాలు రైల్లే ఫ్లైఓవర్ నిర్మించాలని జీఎంలకు అనేక సార్లు వినతిపత్రాలు ఇచ్చారు. ఇటీవల రైల్వే జీఎం రవీంద్రగుప్తాకు స్థానిక నాయకులు కలిసి సమస్యను విన్నవించారు. అరుునా ఫలితం కనిపించడం లేదు. పక్కనే గల ఇరుకుగా ఉన్న బ్రిడ్జి నుంచి తాత్కాలికంగా వాహనాలు పోతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. అప్పటి ఎమ్మెల్యే సీహెచ్.విజయరమణారావు హయూంలో అండర్‌బ్రిడ్జి విస్తరణకు నిధులు మంజూరైనప్పటికీ నేటికి పనులు ప్రారంభం కాలేదు. ఎవరూ పట్టించుకుంటలేరు ఫ్లైఓవర్ నిర్మించాలని చాలా సార్లు జీఎంలకు వినతిపత్రాల ఇచ్చారు. ఎవరూ స్పందించడం లేదు. ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు గంటలతరబడిగా ఆలస్యంగా నడుస్తున్నారుు. చానా ఇబ్బందులు పడుతున్నం. - ఎస్పీ రాజయ్యగౌడ్, కొలనూర్ ఇబ్బందులు పడుతున్నం కొలనూర్ క్రాసింగ్ వద్ద గేట్ ఎప్పటికీ మూసే ఉంటుండడంతో చాలా ఇబ్బందులు పడుతున్నం. 108, 104 బండ్లు కూడా ఆగిపోతున్నాయి. ఫ్లైఓవర్ నిర్మిస్తే మూడు మండలాల ప్రజల కష్టాలు తీరుతాయి. - మాటురి ఎల్లయ్య, గోపరపల్లె పట్టించుకోని రైల్వేశాఖ 1982లో కొలనూర్ గేట్‌వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అరుునా రైల్వేశాఖ పట్టించుకోవడం లేదు. రైళ్లు ఎక్కువగా పోతుండడంతో గంటలతరబడి గేట్ వేసే ఉంటుంది. ఫ్లైఓవర్ మంజూరు చేయూలి. - గుండేటి ఐలయ్యయాదవ్, హరిపురం -
రైలు కిందపడి వివాహిత ఆత్మహత్య
ఏలూరు(పశ్చిమగోదావరి): వివాహిత రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రైల్వే ఫైఓవర్ వద్ద ఆదివారం ఉదయం జరిగింది. వివరాలు.. పెదపాడు మండలం పాత ముప్పర్రుకి చెందిన ముర్రాపు శ్వేత(24)కు అదే గ్రామానికి చెందిన రమేశ్(27)తో నాలుగేళ్ల కిందట వివాహమైంది. ఆదివారం గుడికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకి వచ్చిన శ్వేత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
ఆదిలాబాద్ జిల్లాలో రైల్వే ప్లైఓవర్ బ్రిడ్జి పై ఆందోళన