అబ్బాయిల కంటే అమ్మాయిలకే జీతాలెక్కువ
ముంబై: ఐటీ రంగంలో మగవాళ్లదే ఆధిక్యమయినా.. జీతాల విషయానికొచ్చేసరికి అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువ తీసుకుంటున్నారు. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువ ప్రారంభ వేతనం అందుకుంటున్నట్టు ఓ సర్వేలో తేలింది.
ఢిల్లీలో మూడేళ్లలోపు ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ల జీతాలను పరిశీలిస్తే.. ఏడాదికి అబ్బాయిలు సగటున 9.5 లక్షల రూపాయలు తీసుకుంటుండగా, అమ్మాయిలు 9.8 లక్షల రూపాయలు పొందుతున్నారు. ఇక హైదరాబాద్లో అబ్బాయిలు రూ. 9.4 లక్షలు, అమ్మాయిలు రూ. 9.7 లక్షలు చొప్పున సరాసరి తీసుకుంటున్నారు. అయితే ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ అమ్మాయిల కంటే అబ్బాయిల జీతాలు పెరుగుతున్నట్టు సర్వేలో తేలింది. ఐటీ రంగంలో నాలుగేళ్ల ఎక్స్పీరియన్స్ తర్వాత అబ్బాయిలు దూసుకుపోతున్నారు. 7-10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న పురుష టెకీలు మహిళా ఉద్యోగుల కంటే 50 శాతం అధికంగా జీతం తీసుకుంటున్నారు. కాగా ముంబై, చెన్నై, బెంగళూరు నగార్లలో మహిళలు, పరుషుల ప్రారంభ వేతనాలు దాదాపు సమానంగా ఉన్నట్టు సర్వే వెల్లడించింది.