ఇస్లామాబాద్ శివారులోని బాని గల ప్రాంతంలో యోగా కేంద్రానికి దుండగులు ఆదివారం నిప్పు పెట్టారని స్థానిక మీడియా వెల్లడించింది. యోగా కేంద్రంలోకి కొంత మంది ఆగంతకులు ప్రవేశించి నిర్వాహకులను డబ్బు డిమాండ్ చేశారని, అందుకు నిర్వాహకులు ఒప్పుకోకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాంతో యోగా కేంద్రానికి నిప్పు పెట్టారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారైయ్యారని పేర్కొంది. 2012లో ప్రముఖ యోగా గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ పాకిస్థాన్లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన ఈ యోగా కేంద్రాన్ని స్థాపించారని స్థానిక మీడియా తెలిపింది.