set afire
-
‘ఇంటి అద్దె చెల్లించలేదని చితకబాదారు’
చెన్నై : ఇంటి అద్దె చెల్లించనందుకు ఓ పోలీస్ అధికారి కొట్టడంతో పెయింటర్ ఒంటికి నిప్పంటించుకున్న ఘటన చెన్నైలో వెలుగుచూసింది. నగరంలోని పుజాల్ ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివసించే పెయింటర్ శ్రీనివాసన్ నాలుగు నెలలుగా అద్దె చెల్లించలేదు. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఆదాయం కోల్పోయిన శ్రీనివాసన్ అద్దె చెల్లించలేకపోయాడు. దీంతో ఇల్లు ఖాళీ చేయాలని ఇంటి యజమాని రాజేంద్రన్ పలుమార్లు శ్రీనివాసన్‌ను హెచ్చరించాడు. శ్రీనివాసన్‌పై పుజాల్ పోలీస్ స్టేషన్లో రాజేంద్రన్ ఫిర్యాదు చేశాడు. యజమాని ఫిర్యాదుతో ఇన్స్పెక్టర్ శామ్ బెన్సన్ తన ఇంటికి వచ్చి భార్యా పిల్లల సమక్షంలో తనను తీవ్రంగా కొట్డాడని శ్రీనివాసన్ ఆరోపించాడు. మనోవ్యథతో శ్రీనివాసన్ తన ఒంటికి నిప్పంటించుకున్నాడు. 80 శాతం కాలిన గాయాలతో శ్రీనివాసన్ కిల్పాక్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీనివాసన్‌పై దాడికి పాల్పడిన ఇన్‌స్సెక్టర్‌ను అధికారులు సస్సెండ్ చేశారు. చదవండి : కూతుర్ని హతమార్చి నాటకం -
యువతికి నిప్పంటించిన కీచకుడు
పట్నా: బిహార్‌లో యువతిపై మరో అకృత్యం చోటుచేసుకుంది. అత్యాచారం చేయబోతుండగా ప్రతిఘటించినందుకు 23 ఏళ్ల ఆ యువతికి ఓ కీచకుడు నిప్పంటించాడు. బిహార్‌లోని అహియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని వెంటనే ముజఫరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. 85 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం ఆ యువతి కోమాలో కొట్టుమిట్టాడుతోంది. గత మూడేళ్లుగా తమ కుమార్తెను నిందితుడు వేధిస్తున్నాడని ఆమె తల్లి చెప్పింది. తాజా ఘటనతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్‌చేశారు. ఈ ఘటనపై కేంద్ర మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) బిహార్ ప్రభుత్వానికి సోమవారం నోటీసులు ఇచ్చింది. దర్యాప్తు వివరాలను నాలుగు వారాల్లోగా తమకు తెలపాల్సిందిగా కోరింది. ఈ నోటీసులను రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, డీజీపీలకూ పంపింది. -
హింసాత్మకంగా మారిన గుజ్జర్లు ఆందోళన
-
కోటా రగడ : వాహనాలకు నిప్పంటించిన గుజ్జర్లు
జైపూర్ : విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరుతూ రాజస్ధాన్‌లో గుజ్జర్లు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఆదివారం ఘర్షణ చెలరేగడంతో దోల్పూర్ హైవే రణరంగమైంది. జాతీయ రహదారిని నిర్భందించిన నిరసనకారులు పలు వాహనాలకు నిప్పంటించారు. సవోయి మధోపూర్ జిల్లాలో వరుసగా మూడోరోజూ రైలు పట్టాలపై గుజ్జర్లు ధర్నా నిర్వహించి కోటా డిమాండ్‌ను నెరవేర్చాలని కోరుతూ నినాదాలతో హోరెత్తించారు. కాగా, గుజ్జర్ల ఆందోళనతో వెస్ట్ సెంట్రల్ రైల్వే గత రెండు రోజులుగా ఈ ప్రాంతం మీదుగా వచ్చే రైళ్లను రద్దు చేయగా, పలు రైళ్లను దారిమళ్లించింది. తమకు తక్షణమే ప్రత్యేక కేటగిరీ కింద 5 శాతం రిజర్వేషన్‌ను ప్రకటించాలని గుజ్జర్ల ఉద్యమ నేత కిరోరి సింగ్ భైంస్లా డిమాండ్ చేశారు. రాజస్ధాన్ ప్రభుత్వం గతంలో గుజ్జర్లకు అత్యంత వెనుకబడిన వర్గాల కోటా కింద ఒక శాతం రిజర్వేషన్ ప్రకటించింది. -
యోగా కేంద్రానికి నిప్పు పెట్టిన ఆగంతకులు
ఇస్లామాబాద్ శివారులోని బాని గల ప్రాంతంలో యోగా కేంద్రానికి దుండగులు ఆదివారం నిప్పు పెట్టారని స్థానిక మీడియా వెల్లడించింది. యోగా కేంద్రంలోకి కొంత మంది ఆగంతకులు ప్రవేశించి నిర్వాహకులను డబ్బు డిమాండ్ చేశారని, అందుకు నిర్వాహకులు ఒప్పుకోకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో యోగా కేంద్రానికి నిప్పు పెట్టారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారైయ్యారని పేర్కొంది. 2012లో ప్రముఖ యోగా గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ పాకిస్థాన్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన ఈ యోగా కేంద్రాన్ని స్థాపించారని స్థానిక మీడియా తెలిపింది.