
మంత్రులకు సీఎం యోగి ఝలక్!
ఉత్తరప్రదేశ్ లో తనదైన శైలిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలన సాగిస్తున్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ లో తనదైన శైలిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వ విభాగాల్లో పారదర్శకత పెంచేందుకు, అవినీతిని తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మంత్రులకు ప్రవర్తనా నియావళి విధించినట్టు విశ్వనీయ వర్గాలు వెల్లడించాయి. దీన్ని మంత్రులందరూ పాటించాలని ఆయన ఆదేశించినట్టు తెలిపాయి.
ఏ వ్యాపార సంస్థలోనైనా భాగస్వామం ఉంటే ముందుగా వెల్లడించాలని, లాభదాయక పదవుల్లో కొనసాగరాదని షరతులు విధించినట్టు సమాచారం. అవినీతికి దూరంగా స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కాగా, మంత్రులు 15 రోజుల్లోగా ఆస్తులు వెల్లడించాలని ఇంతకుముందే సీఎం యోగి ఆదేశించారు. ఈ గడువు రేపటితో ముగియనుంది. మరోవైపు యూపీ కేబినెట్ మూడో సమావేశం (నేడు) మంగళవారం జరుగుతుంది.
మంత్రులకు ప్రవర్తనా నియమావళి
- ప్రభుత్వంతో సంబంధం ఉన్న మంత్రుల బంధువుల వివరాలు వెల్లడించాలి
- తమ పదవులను అడ్డం పెట్టుకుని ఎటువంటి వ్యాపారాలు చేయరాదు
- ఆర్భాటపు వేడుకలకు దూరంగా ఉండాలి
- 5 వేల కంటే ఖరీదైన బహుమతి తీసుకుంటే ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి.
- అధికారిక పర్యటనల్లో ప్రభుత్వ నివాసాల్లో బస చేయాలి