నా ఇన్నింగ్స్‌ వారికి అంకితం: యువీ | Yuvraj Singh dedicates innings to cancer survivors | Sakshi
Sakshi News home page

నా ఇన్నింగ్స్‌ వారికి అంకితం: యువీ

Published Mon, Jun 5 2017 1:11 PM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM

నా ఇన్నింగ్స్‌ వారికి అంకితం: యువీ

నా ఇన్నింగ్స్‌ వారికి అంకితం: యువీ

 
చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌పై తాను ఆడిన ఇన్నింగ్స్‌ను భారత క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ క్యాన్సర్‌ను జయించిన వారికి అంకితం చేశాడు. ‘క్యాన్సర్‌ సర్వైవర్‌ డే’ ను పురస్కరించుకొని ఆయన ఈ స్ఫూర్తిదాయక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అలాగే లండన్‌ ఉగ్రవాద దాడుల్లో బాధితులైన వారికి ​ కూడా ఆయన తన నైతిక మద్దతు ప్రకటించాడు. ఉగ్రదాడుల బాధితుల కోసం తాను ప్రార్థిస్తున్నట్టు చెప్పాడు.
 
ఎంతో ఆసక్తి రేపిన పాకిస్థాన్‌ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన యువీ 32 బంతుల్లో 52 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కీలక సమయంలో చెలరేగి ఆడిన యువీని ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ వరించింది. 
 
భారత్‌ 319 పరుగుల భారీ స్కోరు సాధించడంలో యూవీ కీలక పాత్ర పోషించాడు. కేవలం 32 బంతుల్లో యువీ 53 పరుగులు చేయడంతో భారత్‌ తన చివరి 11 ఓవర్లలో 127 పరుగులు రాబట్టింది. 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో సత్తా చాటిన యువీ 29 బంతుల్లోనే అర్ధ శతకాన్ని సాధించాడు. తద్వారా చాంపియన్స్‌ ట్రోఫీలో వేగంగా హాఫ్‌ సెంచరీ సాధించిన భారతీయ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సాధించాడు. అంతేకాదు పాకిస్థాన్‌పై వేగంగా అర్ధ సెంచరీ సాధించిన రెండో భారతీయుడిగా కూడా రికార్డు సొంతం చేసుకున్నాడు. యువీ కెప్టెన్‌ క్లోహితో కలిసి కేవలం పది ఓవర్లలో 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement