ఏది తేల్చకుండానే ముగిసిన జీవోఎం భేటి
Published Tue, Dec 3 2013 6:53 PM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM
మంత్రులు బృందం (జీవోఎం) తుది సమావేశంగా భావించిన భేటిలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే నార్త్ బ్లాక్ లో ముగిసింది. అయితే పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలా లేదా 12 జిల్లాలతో కూడిన రాయల తెలంగాణ ప్రకటించాలా అనే అంశంపై తర్జన భర్జన పడిన సభ్యులు ఎటూ తేల్చకుండానే మరోసారి రేపు కలిసేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం.
గంటకు పైగా జీవోఎం భేటి అనంతరం ఆజాద్ మాట్లాడుతూ.. ఇదే చివరి భేటి కాదు. రేపు ఉదయం మళ్లీ సమావేశమవుతామని ఆజాద్ తెలిపారు. మంగళవారం సమావేశానికి కొనసాగింపుగా మరో భేటి ఉంటుంది అని ఆజాద్ అన్నారు. కేబినెట్ సమావేశానికి ముందు మరోసారి జీవోఎం నివేదికపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని సభ్యులు అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
జీవోఎం ఆమోదించనున్న నివేదికలో రాష్ట్ర విభజనపై సిఫారసులు ఎలా ఉంటాయనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మంత్రుల బృందం (జీవోఎం) సభ్యులందరూ మంగళవారం సాయంత్రం సమావేశానికి హాజరయ్యారు. ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే సారథ్యంలో సాయంత్రం 5 గంటలకు జరిగిన ఈ సమావేశానికి చిదంబరం, ఆంటోని, మొయిలీ, నారాయణ స్వామి, షిండే, జైరాం రమేశ్ లు పాల్గోన్నారు. జీవోఎం భేటికి కేంద్ర మంత్రులు కావూరి, పల్లంరాజు, జాతీయ భద్రతా సలహాదారుడు శివశంకర్ మీనన్ కూడా హాజరయ్యారు.
Advertisement
Advertisement