GoM Meeting
-
వీటిపై జీఎస్టీ తగ్గింపు.. భారీగా తగ్గనున్న ధరలు
జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం (GoM) కొన్ని వస్తువుల ధరల మీద జీఎస్టీ తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో 20-లీటర్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్, సైకిళ్స్, ఎక్సర్సైజ్ నోట్బుక్లు ఉన్నాయి. ఇదే సమయంలో రిస్ట్ వాచీలు, బూట్లపైన జీఎస్టీ పెంచినట్లు అధికారి తెలిపారు.బీహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆధ్వర్యంలో జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం తీసుకున్న రేట్ రీజిగ్ నిర్ణయం రూ. 22,000 కోట్ల ఆదాయానికి దారి తీస్తుందని అధికారులు తెలిపారు.20 లీటర్లు అంతకంటే ఎక్కువ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని మంత్రుల బృందం ప్రతిపాదించింది. మంత్రుల బృందం సిఫార్సును జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించినట్లయితే.. రూ.10,000 కంటే తక్కువ ధర ఉన్న సైకిళ్లపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గుతుంది.ఎక్సర్సైజ్ నోట్‌బుక్‌లపై కూడా జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించనున్నట్లు మంత్రుల బృందం ప్రతిపాదించింది. రూ.15,000 కంటే ఎక్కువ ధర కలిగిన బూట్లు మీద, రూ. 25,000 ఎక్కువ ధర కలిగిన రిస్ట్ వాచీలపై జీఎస్టీ 18 శాతం నుంచి 28 శాతానికి పెంచనున్నారు.ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీసమావేశంలో రేట్ల హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం తీసుకున్న నిర్ణయాలు.. సామాన్యులకు ఉపశమనం కలిగించనున్నాయి. ఈ సమావేశంలో 100 కంటే ఎక్కువ వస్తువులకు సంబంధించి జీఎస్టీ రేట్లను చర్చించారు. అయితే 18 శాతం శ్లాబులో ఉన్న హెయిర్ డ్రైయర్లు, హెయిర్ కర్లర్లపై ఉన్న జీఎస్టీని మళ్ళీ 28 శాతం శ్లాబులోకి చేర్చనున్నట్లు బృందం వెల్లడించింది.జీఎస్టీ అనేది ప్రస్తుతం 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం అనే నాలుగు శ్లాబుల్లో ఉంది. ఇందులో కొన్ని వస్తువులు తక్కువ శ్లాబులో.. మరికొన్ని ఎక్కువ శ్లాబులో ఉన్నాయి. మరికొన్ని వస్తువులకు జీఎస్టీ మాత్రమే కాకుండా.. అదనంగా సెస్‌ను కూడా విధిస్తున్నారు. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, సీనియర్ సిటిజన్ భీమా కవరేజీకి జీఎస్టీలో మినహాయింపు ఉండవచ్చు. -
కొత్త రాజధాని కోసం ఐదుగురు సభ్యులతో కమిటీ
న్యూఢిల్లీ: సీమాంధ్ర నూతన రాజధాని ఎంపిక కోసం ఐదుగురు సభ్యులతో నిపుణుల కమిటీ వేయనున్నట్టు జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ తెలిపారు. జీవోఎం భేటీ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజనపై కేంద్రం తీసుకున్న చర్యలను ఇప్పటివరకు జీవోఎం సమీక్షించిందని వెల్లడించారు. జూన్ 2లోగా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన కోసం 19 కమిటీల ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఉద్యోగుల కేటాయింపుల కోసం రెండు కమిటీలు వేశామన్నారు. మార్చి 31 లోగా కమిటీలు నివేదిక అందజేస్తాయని అన్నారు. కృష్ణా, గోదావరి నదుల నిర్వహణకు వేర్వేరుగా సర్వోన్నత మండళ్లను రేపు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఏపీ రాజధాని కోసం ప్రణాళిక సంఘంలో ప్రత్యేక విభాగం ఏర్పాటయిందని జైరాం రమేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాస్... రాజధాని సెల్ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. త్వరలో మరోసారి జీవోఎం భేటీ కానుంది. -
రమ్మంటేనే వచ్చాం: చిరంజీవి
న్యూఢిల్లీ: గతంలో తామిచ్చిన డిమాండ్లకు విభజన బిల్లులో స్పష్టత లేదని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. తమ ప్రతిపాదనలు తీసుకోకపోవడం వల్లే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. జీవోఎం సభ్యులతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. తమకు తాముగా ఈ సమావేశానికి రాలేదన్నారు. రమ్మంటేనే సమావేశానికి వచ్చామని వెల్లడించారు. గతంలో తాము చేసిన డిమాండ్లపై ఈ సమావేశంలో సమీక్షించారని చెప్పారు. తాము అడిగిన వాటికి ఒప్పుకుంటారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. జీవోఎం తీసుకునే నిర్ణయాలపై తమ తదుపరి కార్యాచరణ ఆధారపడి ఉంటుందని తెలిపారు. జీవోఎం సభ్యుల ముందు తమ వాదనలు బలంగా వినిపించామని మరో కేంద్ర మంత్రి జేడీ శీలం తెలిపారు. గతంలో ఇచ్చిన అభ్యర్థనలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగినట్టు చెప్పారు. తెలుగు వారికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. తమ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటే తమకు ఊరట కలుగుతుందన్నారు. కాగా, జీవోఎం సభ్యులు రేపు మరోసారి భేటీ కానున్నారు. -
ఈ రోజు మద్యాహ్నం GOM భేటీ
-
ఏది తేల్చకుండానే ముగిసిన జీవోఎం భేటి
-
ఏది తేల్చకుండానే ముగిసిన జీవోఎం భేటి
మంత్రులు బృందం (జీవోఎం) తుది సమావేశంగా భావించిన భేటిలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే నార్త్ బ్లాక్ లో ముగిసింది. అయితే పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలా లేదా 12 జిల్లాలతో కూడిన రాయల తెలంగాణ ప్రకటించాలా అనే అంశంపై తర్జన భర్జన పడిన సభ్యులు ఎటూ తేల్చకుండానే మరోసారి రేపు కలిసేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం. గంటకు పైగా జీవోఎం భేటి అనంతరం ఆజాద్ మాట్లాడుతూ.. ఇదే చివరి భేటి కాదు. రేపు ఉదయం మళ్లీ సమావేశమవుతామని ఆజాద్ తెలిపారు. మంగళవారం సమావేశానికి కొనసాగింపుగా మరో భేటి ఉంటుంది అని ఆజాద్ అన్నారు. కేబినెట్ సమావేశానికి ముందు మరోసారి జీవోఎం నివేదికపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని సభ్యులు అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జీవోఎం ఆమోదించనున్న నివేదికలో రాష్ట్ర విభజనపై సిఫారసులు ఎలా ఉంటాయనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మంత్రుల బృందం (జీవోఎం) సభ్యులందరూ మంగళవారం సాయంత్రం సమావేశానికి హాజరయ్యారు. ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే సారథ్యంలో సాయంత్రం 5 గంటలకు జరిగిన ఈ సమావేశానికి చిదంబరం, ఆంటోని, మొయిలీ, నారాయణ స్వామి, షిండే, జైరాం రమేశ్ లు పాల్గోన్నారు. జీవోఎం భేటికి కేంద్ర మంత్రులు కావూరి, పల్లంరాజు, జాతీయ భద్రతా సలహాదారుడు శివశంకర్ మీనన్ కూడా హాజరయ్యారు. -
జీవోఎం చివరి సమావేశం ప్రారంభం
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి జీవోఎం సభ్యుల చివరి సమావేశం ప్రారంభమైంది. ఈ సభకు కేంద్ర మంత్రుల బృందం పూర్తి స్తాయిలో హాజరైంది. విభజన అంశం చివరి అంకానికి చేరడంతో జీవోఎం సభ్యులు సుశీల్ కుమార్ షిండే, ఆంటోని,పి. చిదంబరం, నారాయణ స్వామి, వీరప్ప మొయిలీ, గులాంనబీ ఆజాద్ లు హాజరైయ్యారు. ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో గల హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే సారథ్యంలో మంగళవారం సాయంత్ర జరుగుతున్న ఈ సమావేశంలో.. విభజనపై తమకిచ్చిన విధివిధానాల మేరకు ఇప్పటికే రూపొందించిన నివేదిక, విభజన ముసాయిదా బిల్లును సభ్యులు పరిశీలిస్తారు. న్యాయశాఖ పరిశీలనకు వెళ్లి కామెంట్లతో తిరిగివచ్చిన నివేదిక, ముసాయిదా బిల్లును హోంశాఖ ఉన్నతాధికారులు పరిశీలించి జీవోఎం ముందు ఉంచడానికి అవసరమైన పత్రాలన్నీ సిద్ధం చేశారని సమాచారం. విభజన ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలు, ఆస్తులు, అప్పుల పంపిణీ, హైదరాబాద్‌లో నివసిస్తున్న ఇతర ప్రాం తాల వారి హక్కులు, జన వనరులు, విద్యుత్ కేటాయిం పులు, ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై కేంద్ర జీఓఎంను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
జీవోఎం భేటి: ముఖ్యనేతలతో కేసీఆర్ భేటి
జీవోఎం తుది భేటి నేపథ్యంలో పార్టీ ముఖ్యనేతలతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం రాయల తెలంగాణ ప్రకటించవచ్చనే వార్తలు వెలువడుతున్న క్రమంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రాయల తెలంగాణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే పార్టీ అనుసారించాల్సిన విధానంపై, తాజ పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కీలక నిర్ణయం వెలువడుతున్న నేపథ్యంలో ముఖ్య నేతలందరూ అందుబాటులో ఉండాలని టీఆర్ఎస్ పార్టీ సూచించింది. -
రాయలతెలంగాణ గురించి నాకు తెలుయదు:షిండే
-
టోటల్‌గా ముంచుడు
-
జీవోఎం చర్చలు పై హెడ్ లైన్ షో
-
'ఉమ్మడి' ఏడాది చాలు
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకు పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించినా సీమాంధ్రలో కొత్త రాజధానిని ఏడాదిలోపే నిర్మించుకునేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని తెలంగాణ కేంద్ర మంత్రులు విభజనపై జీవోఎంకు నివేదించనున్నారు. ఒకవేళ అక్కడి ప్రభుత్వం జాప్యం చేసినట్లయితే కేంద్రమే జోక్యం చేసుకుని త్వరితగతిన కొత్త రాజధానిని నిర్మించి సీమాంధ్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని అక్కడికి తరలించాలని కోరనున్నారు. టీ- కేంద్రమంత్రుల బృందం సోమవారం జీవోఎంతో భేటీ అవుతున్న నేపథ్యంలో.. ఆ కమిటీ ఎదుట ప్రతిపాదించాల్సిన అంశాలపై కాంగ్రెస్ తెలంగాణ నేతలు ఆదివారం కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో సమావేశమై నివేదికను రూపొందించారు. కేంద్రమంత్రులు సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, రాష్ట్ర మంత్రులు కె.జానారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఆరెపల్లి మోహన్, శ్రీధర్, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కె.యాదవరెడ్డి, సీనియర్ నేతలు బి.కమలాకరరావు, మల్లు రవి, వకుళాభరణం కృష్ణమోహన్, గంగాధర్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు నివేదికలోని అంశాలు ఇంకా ఇలావున్నాయి... హైదరాబాద్ పరిధిలో శాంతిభద్రతలు తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే ఉండాలి. వాటి పర్యవేక్షణ బాధ్యతను మాత్రం తెలంగాణ, సీమాంధ్ర సీఎంలు, డీజీపీలతో కమిటీని వేసి కేంద్ర ప్రతినిధిని కన్వీనర్‌గా నియమించి అందించాలి. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాం. ప్రజాహితం కోసం కాకుండా స్వలాభం కోసం వివిధ సంస్థలకు కట్టబెట్టిన భూముల వ్యవహారంపై విచారణ జరిపి వాటిని స్వాధీనం చేసుకునే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుంది. నిబంధనల మేరకు ప్రభుత్వ భూములను సక్రమంగా వినియోగించుకుంటున్న సంస్థలు యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే శాసనమండలిని కూడా పునరుద్ధరించాలి. తెలంగాణ బిల్లులోనే ఈ అంశాన్ని స్పష్టంగా పొందుపర్చాలి. సాగునీటి కేటాయింపుల్లో బచావత్ ట్రిబ్యునల్ తీర్పును అమలు చేయాలి. బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించాలి. విభజన బిల్లులో హైకోర్టు, ఏపీపీఎస్సీ ఏర్పాటు ను ప్రస్తావించాలి. విభజన జరిగిన తరువాతే నియామకాలు చేపట్టాలి. హైకోర్టు జడ్జీల నియామకంలో తెలంగాణ వారికే ప్రాధాన్యమివ్వాలి. పోలవరం ప్రాజెక్టుతో పాటు ప్రాణహిత-చేవెళ్ల, కంతనపల్లి, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా ఇవ్వాలి. తెలంగాణతో పాటు సీమాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలన్నింటికీ ప్రణాళిక సంఘం ద్వారా తగిన ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి అభివృద్ధి చేయాలి. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో తీవ్ర విద్యుత్ కొరత నెలకొనే అవకాశమున్నందున కేంద్రం ఈ అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. బోర్లపై వ్యవసాయం ఆధారపడి ఉన్నందున ప్రస్తుతం రాష్ట్రంలో సరఫరా చేస్తున్న విద్యుత్‌లో 56 శాతం తెలంగాణకు, 44 శాతం సీమాంధ్రకు కేటాయిస్తున్నారు. విభజన జరిగిన తరువాత కూడా ఇదే నిష్పత్తిని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి. -
జీవోఎంకు వెళ్తా.. సమైక్యవాదం వినిపిస్తా: కిరణ్
కేంద్ర మంత్రుల బృందం ఈనెల 18న నిర్వహించే సమావేశానికి వెళ్తానని, అక్కడ సమైక్యవాదాన్ని వినిపిస్తానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే శ్రీశైలం ప్రాజెక్టు ఎవరిదవుతుందని, విభజన జరిగితే తెలంగాణకే ఎక్కువ నష్టమని కిరణ్ చెప్పారు. తెలంగాణలో ప్రాజెక్టులకు విద్యుత్ ఉత్పాదన కోసం రూ.40వేల కోట్లు ఖర్చు అవుతుందని, ఉద్యోగుల జీతాలకు రూ.5వేల కోట్ల అదనపు భారం పడుతుందని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు విభజనకు సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా, కృష్ణా జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కిరణ్‌కు సమైక్య సెగ తగిలింది. మక్కపేట వద్ద ముఖ్యమంత్రిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సామినేని ఉదయభాను సహా సమైక్యవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని అక్కడకు సమీపంలో ఉన్న వత్సవాయి పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
అయోమయం సృష్టించేందుకే కాంగ్రెస్ హైడ్రామా
-
షిండేతో బొత్స భేటిలో ఆంతర్యమేమిటి!
కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)తో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ముందే కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమావేశమవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జీవోఎం సమావేశానికి వెళ్లే కాంగ్రెస్ పార్టీ సభ్యుల్లో బొత్స ఒకరు కాకపోగా, షిండేతో 20 నిమిషాలపాటు భేటి కావడం మీడియాలో చర్చనీయాంశమైంది. వాస్తవానికి జీవోఎం సమావేశానికి కాంగ్రెస్ తరపున మంత్రి వట్టి వసంతకుమార్, డిప్యూటి ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలు బుధవారం సాయంత్రం సమావేశంకానున్నారు. ఈ నేపథ్యంలో షిండేను కలువడం అనేక సందేహాలకు తావిస్తోంది. రాష్ట్ర విభజనపై పలు పార్టీలతో జరుగుతున్న కీలక జీవోఎం సమావేశానికి ముందు షిండేతో బొత్స సమావేశం కొంత వివాదానికి తెర తీసింది. ఇదే విషయంపై బొత్సను మీడియా అడిగితే.. 'హోం మంత్రి షిండే రమ్మంటేనే ఢిల్లీ వచ్చాను', కాంగ్రెస్ నుంచి మంత్రి వట్టి వసంతకుమార్, దామోదర రాజనర్సింహ ఏం నివేదిక ఇస్తారో నాకు తెలియదు అని అన్నారు.