కేంద్ర మంత్రుల బృందం ఈనెల 18న నిర్వహించే సమావేశానికి వెళ్తానని, అక్కడ సమైక్యవాదాన్ని వినిపిస్తానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.
కేంద్ర మంత్రుల బృందం ఈనెల 18న నిర్వహించే సమావేశానికి వెళ్తానని, అక్కడ సమైక్యవాదాన్ని వినిపిస్తానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే శ్రీశైలం ప్రాజెక్టు ఎవరిదవుతుందని, విభజన జరిగితే తెలంగాణకే ఎక్కువ నష్టమని కిరణ్ చెప్పారు. తెలంగాణలో ప్రాజెక్టులకు విద్యుత్ ఉత్పాదన కోసం రూ.40వేల కోట్లు ఖర్చు అవుతుందని, ఉద్యోగుల జీతాలకు రూ.5వేల కోట్ల అదనపు భారం పడుతుందని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు విభజనకు సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
కాగా, కృష్ణా జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కిరణ్‌కు సమైక్య సెగ తగిలింది. మక్కపేట వద్ద ముఖ్యమంత్రిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సామినేని ఉదయభాను సహా సమైక్యవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని అక్కడకు సమీపంలో ఉన్న వత్సవాయి పోలీసు స్టేషన్కు తరలించారు.