chillakallu
-
ఆర్టీసీ గరుడ బస్సు బోల్తా
చిల్లకల్లు (జగ్గయ్యపేట): ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్‌ప్లాజాకు సమీపంలో మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఏపీఎస్ ఆర్టీసీ గరుడ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో విజయవాడకు చెందిన నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఏపీ16 జడ్ 0599 బస్సు విజయవాడ నుంచి మియాపూర్ వెళ్తుండగా టోల్‌ప్లాజా వద్దకు వచ్చే సరికి హెడ్లైట్లలో సమస్య తలెత్తడంతో అదుపు తప్పింది. డ్రైవర్ నియంత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ పక్కకు దూసుకెళ్లి ఓ వైపునకు బోల్తా పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కాపాడండంటూ కేకలు వేశారు. గమనించిన టోల్‌ప్లాజా సిబ్బంది, హైవే పోలీసులు బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడ్డ వారిని జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగతా వారిని మరో బస్సు ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు పంపించారు. -
పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఐజీ
చిల్లకల్లు(జగ్గయ్యపేట) : స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఏలూరు రేంజ్ డీఐజీ పీవీవీఎస్ రామకృష్ణ శుక్రవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణపై మరింత దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా స్టేషన్ ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఉండడంతో 24 గంటలు సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. రానున్న రోజుల్లో స్టేషన్‌కు మరి కొంత మంది సిబ్బందిని నియమించే అవకాశం ఉందన్నారు. ఆయన వెంట నందిగామ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐ వైవీఎల్ నాయుడు, ఎస్ఐ షణ్ముకసాయి ఉన్నారు. -
భార్యకు శీల పరీక్ష పెట్టిన భర్త
భార్యను శీల పరీక్షకు నిలిపిన భర్త కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో జంగాల కాలనీకి చెందిన పస్తం బాలకృష్ణ తన భార్య తిరుమలమ్మను శీల పరీక్షకు నిలిపాడు. ఇటీవల ఆమె బండిపాలెం గ్రామానికి చెందిన నరసింహారావుకు చెందిన కిరాయి ఆటో ఎక్కింది. ఆ సమయంలో అతడు తిరుమలమ్మతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీన్ని ఆమె భర్తకు చెప్పగా అతను అనుమానంతో ఆమెకు శీల పరీక్ష చేయించాలని నిర్ణయించుకున్నాడు. కుల పెద్దలకు సమాచారమిచ్చి వారిని గురువారం తెల్లవారుజామున చిల్లకల్లు-మక్కపేట రహదారి ఎన్ఎస్పీ కాల్వగట్టు వద్దకు రావాలని కోరాడు. వారు వచ్చేసరికి గట్టుపై కట్టెల పొయ్యి వెలిగించి ఆకురాయిని ఎర్రగా కాల్చాడు. ముందుగా భార్య శరీరానికి పసుపు పూసి కుంకుమ పెట్టాడు. ఆ తర్వాత కాలిన ఆకురాయిని నిప్పుల్లో నుంచి తీసి చేత్తో పట్టుకుని శీలపరీక్షలో నెగ్గాలని తిరుమలమ్మకు సూచించాడు. ఈ విషయం తెలుసుకున్న చిల్లకల్లు ఎస్.ఐ. షణ్ముఖసాయి, సిబ్బందితో వెళ్లి సంఘటనను అడ్డుకున్నారు. కుల పెద్దలు, భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. - చిల్లకల్లు (జగ్గయ్యపేట) -
భార్యకు శీల పరీక్ష పెట్టిన భర్త
-
జీవోఎంకు వెళ్తా.. సమైక్యవాదం వినిపిస్తా: కిరణ్
కేంద్ర మంత్రుల బృందం ఈనెల 18న నిర్వహించే సమావేశానికి వెళ్తానని, అక్కడ సమైక్యవాదాన్ని వినిపిస్తానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే శ్రీశైలం ప్రాజెక్టు ఎవరిదవుతుందని, విభజన జరిగితే తెలంగాణకే ఎక్కువ నష్టమని కిరణ్ చెప్పారు. తెలంగాణలో ప్రాజెక్టులకు విద్యుత్ ఉత్పాదన కోసం రూ.40వేల కోట్లు ఖర్చు అవుతుందని, ఉద్యోగుల జీతాలకు రూ.5వేల కోట్ల అదనపు భారం పడుతుందని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు విభజనకు సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా, కృష్ణా జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కిరణ్‌కు సమైక్య సెగ తగిలింది. మక్కపేట వద్ద ముఖ్యమంత్రిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సామినేని ఉదయభాను సహా సమైక్యవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని అక్కడకు సమీపంలో ఉన్న వత్సవాయి పోలీసు స్టేషన్‌కు తరలించారు.