
పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఐజీ
చిల్లకల్లు(జగ్గయ్యపేట) : స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఏలూరు రేంజ్ డీఐజీ పీవీవీఎస్ రామకృష్ణ శుక్రవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణపై మరింత దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా స్టేషన్ ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఉండడంతో 24 గంటలు సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. రానున్న రోజుల్లో స్టేషన్‌కు మరి కొంత మంది సిబ్బందిని నియమించే అవకాశం ఉందన్నారు. ఆయన వెంట నందిగామ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐ వైవీఎల్ నాయుడు, ఎస్‌ఐ షణ్ముకసాయి ఉన్నారు.