dig ramakrishna
-
బలమైన పోలీస్ వ్యవస్థ ఏర్పాటుకు కృషి
గంపలగూడెం : ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు ఏర్పరచి, మెరుగైన సేవలు అందించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు డీఐజీ పీవీఎస్ రామకృష్ణ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా ప్రమాదాలు, అరాచకాలు, నేరాలు నియంత్రించవచ్చని, ఆ కోణంలో ప్రయత్నాలు చేపడుతుతున్నామన్నారు. ఇందులో భాగంగానే గ్రామస్థాయి నుంచి వివిధ అంశాల్లో (నేరాలు, అక్రమాలు, ప్రమాదాలు) సమాచారం ఇచ్చేందుకు , స్వచ్ఛందంగా పోలీసులతో కలిసి విధుల్లో పనిచేసేందుకు ఉత్సాహం ఉన్నవారిని ఎంపిక చేసిన శిక్షణ ఇస్తామని చెప్పారు. టెక్నాలజీ వినియోగం అనేక సమస్యల పరిష్కారం, విచారణకు ఉపయోగపడుతుందని వివరించారు. ఓవర్ లోడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ నియంత్రణ చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించామన్నారు. పెద్దనోట్ల రద్దు కారణంగా నోట్ల మార్పిడిలో చోటుచేసుకుంటున్న అక్రమాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయంలో పోలీసులైనా వదిలేది లేదని స్పష్టం చేశారు. అనంతరం రామకృష్ణ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నూజివీడు డీఎస్పీ వి. శ్రీనివాసరావు, తిరువూరు సీఐ కిషోర్‌బాబు, ఎస్సై శివరామకృష్ణ పాల్గొన్నారు. -
పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఐజీ
చిల్లకల్లు(జగ్గయ్యపేట) : స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఏలూరు రేంజ్ డీఐజీ పీవీవీఎస్ రామకృష్ణ శుక్రవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణపై మరింత దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా స్టేషన్ ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఉండడంతో 24 గంటలు సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. రానున్న రోజుల్లో స్టేషన్‌కు మరి కొంత మంది సిబ్బందిని నియమించే అవకాశం ఉందన్నారు. ఆయన వెంట నందిగామ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐ వైవీఎల్ నాయుడు, ఎస్ఐ షణ్ముకసాయి ఉన్నారు. -
పోలీసుల పనితీరు మెరుగుపడాలి
ఏలూరు అర్బన్: జిల్లా పోలీసు యంత్రాంగం పనితీరు సంతృప్తికరంగా లేదని ఏలూరు రేంజి డీఐజీ పీవీఎస్ రామకృష్ణ అన్నారు. స్థానిక అమీనాపేటలోని సురేష్‌చంద్ర బహుగుణ కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన అర్ధ సంవత్సర నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో జిల్లాలో వరుస దొంగతనాలు, దోపిడీలు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నేరాలు నియంత్రించడంలో పోలీసులు పనితీరు మెరుగుపడాల్సి ఉందన్నారు. జిల్లాలో జరుగుతున్న నేరాలకు కేవలం పోలీసు వ్యవస్థే కారణం కాదని నేరాల నియంత్రణలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపమే కారణమని విశ్లేషించారు. చోరీలు, ట్రాఫిక్ నేరాల నియంత్రణకు అధికారులు తీసుకున్న చర్యలపై ప్రశ్నించారు. శాఖలన్నీ సమన్వయంతో పనిచేయడం ద్వారా నేరాలను కనీస స్థాయికి తగ్గించి అదుపుచేయవచ్చని సూచించారు. జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్, ఏలూరు, కొవ్వూరు, నరసాపురం, జంగారెడ్డిగూడెం, ఎస్బీ, ఎస్సీ ఎస్టీ సెల్, క్రైమ్, క్లూస్‌టీమ్ డీఎస్పీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, రోడ్స్ అండ్ బిల్డింగ్, హైవే అధికారులు పాల్గొన్నారు. -
పుష్కరాల్లో హైవేపై ట్రాఫిక్ మళ్లింపు
ఏలూరు (మెట్రో) : కృష్ణా పుష్కరాల సందర్భంగా 12వ తేదీ నుంచి జిల్లా మీదుగా వెళ్లే భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నట్టు ఏలూరు రేంజ్ డీఐజీ పి.వి.రామకృష్ణ తెలిపారు. సోమవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దారి మళ్లింపు ఇలా ∙చెన్నై వైపు వెళ్లాల్సిన భారీ వాహనాలను కత్తిపూడి – అమలాపురం– చించినాడ– పాలకొల్లు– భీమవరం– కైకలూరు– గుడివాడ– చల్లపల్లి మీదుగా ఒంగోలు పంపిస్తారు. అలాగే రాజమండ్రి నుంచి వచ్చే వాహనాలను రాజమండ్రి– సిద్ధాంతం బ్రిడ్జి – తాడేపల్లిగూడెం– ఆకివీడు – గుడివాడ– చల్లపల్లి– రేపల్లె– ఒంగోలు మీదుగా చెన్నై పంపిస్తారు అలాగే నారాయణపురం– గణపవరం– ఉండి– ఆకివీడు – కైకలూరు– గుడివాడ – చల్లపల్లి– రేపల్లె మీదుగా ఒంగోలు పంపిస్తారు. అలాగే రాజమండ్రి– సిద్ధాంతం బ్రిడ్జి – హనుమాన్ జంక్షన్– గుడివాడ– చల్లపల్లి– మోపిదేవి– రేపల్లె– ఒంగోలు మీదుగా కూడా చెన్నై తరలిస్తారు. అలాగే దేవరపల్లి – గుండుగొలను – నారాయణపురం– గణపవరం– ఉండి– ఆకివీడు– కైకలూరు– గుడివాడ–చల్లపల్లి– మోపిదేవి– రేపల్లె– ఒంగోలు మీదుగా కూడా చెన్నై తరలిస్తారు. ∙కోల్‌కతావైపు వెళ్లాల్సిన వాహనాలను ఒంగోలు – రేపల్లె– మోపిదేవి– చల్లపల్లి– మచిలీపట్నం– పెడన– కృత్తివెన్ను – లోసరి– నర్సాపురం – చించినాడ– రాజోలు– అమలాపురం– కాకినాడ – కత్తిపూడి మీదుగా పంపిస్తారు. అలాగే ఒంగోలు – రేపల్లె– మోపిదేవి– చల్లపల్లి– గుడివాడ– హనుమాన్‌జంక్షన్– సిద్ధాంతం బ్రిడ్జి– రాజమండ్రి మీదుగా కూడా విశాఖపట్నం తరలిస్తారు. అలాగే ఒంగోలు– రేపల్లె– మోపిదేవి– చల్లపల్లి– గుడివాడ– కైకలూరు– ఏలూరు– సిద్ధాంతంబ్రిడ్జి– రాజమండ్రి మీదుగా విశాఖపట్నం తరలిస్తారు.