పోలీసుల పనితీరు మెరుగుపడాలి
Published Wed, Aug 31 2016 8:47 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
ఏలూరు అర్బన్: జిల్లా పోలీసు యంత్రాంగం పనితీరు సంతృప్తికరంగా లేదని ఏలూరు రేంజి డీఐజీ పీవీఎస్ రామకృష్ణ అన్నారు. స్థానిక అమీనాపేటలోని సురేష్‌చంద్ర బహుగుణ కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన అర్ధ సంవత్సర నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో జిల్లాలో వరుస దొంగతనాలు, దోపిడీలు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నేరాలు నియంత్రించడంలో పోలీసులు పనితీరు మెరుగుపడాల్సి ఉందన్నారు. జిల్లాలో జరుగుతున్న నేరాలకు కేవలం పోలీసు వ్యవస్థే కారణం కాదని నేరాల నియంత్రణలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపమే కారణమని విశ్లేషించారు. చోరీలు, ట్రాఫిక్ నేరాల నియంత్రణకు అధికారులు తీసుకున్న చర్యలపై ప్రశ్నించారు. శాఖలన్నీ సమన్వయంతో పనిచేయడం ద్వారా నేరాలను కనీస స్థాయికి తగ్గించి అదుపుచేయవచ్చని సూచించారు. జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్, ఏలూరు, కొవ్వూరు, నరసాపురం, జంగారెడ్డిగూడెం, ఎస్బీ, ఎస్సీ ఎస్టీ సెల్, క్రైమ్, క్లూస్‌టీమ్ డీఎస్పీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లు, రోడ్స్ అండ్ బిల్డింగ్, హైవే అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement