జీవోఎం భేటి: ముఖ్యనేతలతో కేసీఆర్ భేటి
Published Tue, Dec 3 2013 5:25 PM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM
జీవోఎం తుది భేటి నేపథ్యంలో పార్టీ ముఖ్యనేతలతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం రాయల తెలంగాణ ప్రకటించవచ్చనే వార్తలు వెలువడుతున్న క్రమంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
ఒకవేళ రాయల తెలంగాణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే పార్టీ అనుసారించాల్సిన విధానంపై, తాజ పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కీలక నిర్ణయం వెలువడుతున్న నేపథ్యంలో ముఖ్య నేతలందరూ అందుబాటులో ఉండాలని టీఆర్ఎస్ పార్టీ సూచించింది.
Advertisement
Advertisement