కర్నూలు, అనంతపురం జిల్లాలను కలుపుకుంటేనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమవుతుందని తెలంగాణవాదులు గ్రహించాలని ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా అన్నారు.
హైదరాబాద్ : కర్నూలు, అనంతపురం జిల్లాలను కలుపుకుంటేనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమవుతుందని తెలంగాణవాదులు గ్రహించాలని ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా అన్నారు. ఇప్పుడు విభజన జరగకపోతే మరెప్పటికీ జరగదని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. సాగు, తాగునీరు లేక కర్నూలు, అనంతపురం నష్టపోతామనే ఆవేదనతోనే రాయల తెలంగాణ అంటున్నామని మధుసూదన్ గుప్తా అన్నారు. పది జిల్లాల తెలంగాణ ఏర్పడితే శ్రీశైలం ప్రాజెక్ట్ సమస్యాత్మకం అవుతుందన్నారు.
రాయల తెలంగాణ ఏర్పడకపోతే దేశమే విడిపోతుందని ఆయన అన్నారు. దక్షిణ భారతదేశం ప్రత్యేక దేశం కోసం పోరాడే పరిస్థితులు వస్తాయని మధుసూదన్ గుప్తా పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలోనే 2014 ఎన్నికలు జరిగితే తెలంగాణ ప్రజలు సమైక్యవాద పార్టీలకే పట్టం కడతారని ఆయన అన్నారు.