madhusudhan gupta
-
ఈవీఎంను నేలకేసి కొట్టిన జనసేన అభ్యర్ధి
-
‘భూ పంపిణీకి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్సే’
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : నిరుపేదలకు భూములు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాష్ర్ట రెవెన్యూశాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. నగరంలోని కృష్ణకళామందిరంలో మంగళవారం ఏడో విడత భూ పంపిణీ అట్టహాసంగా జరిగింది. అనంతపురం రెవెన్యూ డివిజన్లోని 3833 ఎకరాల భూ పంపిణీకి 2076 మందిని ఎంపిక చేశారు. లబ్ధిదారుల్లో 593 మంది ఎస్సీలు, 147 మంది గిరిజనులు, 1031 మంది వెనుకబడిన తరగతుల వారు, 11 మంది మైనార్టీలు, 294 మంది ఓసీలు ఉన్నారు. వీరిలో కొందరికి మంత్రి రఘువీరా చేతుల మీదుగా పట్టా పాసుపుస్తకాలు, టైటిల్డీడ్లను అందజేశారు. సాగుదారులకే పట్టాలు పంచామని మంత్రి అన్నారు. పేదలకు సామాజిక భద్రతతోపాటు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అసెంబ్లీలో రాష్ర్ట విభజన బిల్లును ఓడించేందుకు సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా ఒకేతాటిపైకి రావాలన్నారు. రాష్ర్ట ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ సాగు చేస్తున్న వారికే పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ నీటి కేటాయింపుల విషయంలో అనంతపురం జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తా, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఏజేసీ వెంకటేశం, ఆర్డీఓ హుస్సేన్‌సాబ్ పాల్గొన్నారు. సాగు భూములకు పట్టాలతో భద్రత కదిరి అర్బన్ : ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకు భూ పంపిణీకింద అందజేసిన పట్టాలతో భద్రత కల్పిస్తున్నామని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. కదిరి బాలికల ఉన్నతపాఠశాలలో ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమం జరిగింది. భూ పంపిణీకి కదిరి నియోజకవర్గంలో 1727 మంది, పుట్టపర్తి నియోజకవర్గంలో 985 మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరందరికీ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మంత్రి చేతుల మీదుగా పట్టాలు అందజేశారు. త్వరలోనే రెవెన్యూ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. సంక్రాంతి లోపు ఇన్పుట్ సబ్సిడీ పరిహారం రైతుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు. జిల్లాలోని 63 మండలాలనూ కరువు మండలాలుగా ప్రకటిస్తామని చెప్పారు. అంతకు ముందు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించాలని కోరారు. -
'రాయల తెలంగాణ ఏర్పడకపోతే దేశమే విడిపోతుంది'
హైదరాబాద్ : కర్నూలు, అనంతపురం జిల్లాలను కలుపుకుంటేనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమవుతుందని తెలంగాణవాదులు గ్రహించాలని ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా అన్నారు. ఇప్పుడు విభజన జరగకపోతే మరెప్పటికీ జరగదని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. సాగు, తాగునీరు లేక కర్నూలు, అనంతపురం నష్టపోతామనే ఆవేదనతోనే రాయల తెలంగాణ అంటున్నామని మధుసూదన్ గుప్తా అన్నారు. పది జిల్లాల తెలంగాణ ఏర్పడితే శ్రీశైలం ప్రాజెక్ట్ సమస్యాత్మకం అవుతుందన్నారు. రాయల తెలంగాణ ఏర్పడకపోతే దేశమే విడిపోతుందని ఆయన అన్నారు. దక్షిణ భారతదేశం ప్రత్యేక దేశం కోసం పోరాడే పరిస్థితులు వస్తాయని మధుసూదన్ గుప్తా పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలోనే 2014 ఎన్నికలు జరిగితే తెలంగాణ ప్రజలు సమైక్యవాద పార్టీలకే పట్టం కడతారని ఆయన అన్నారు. -
జగన్ రాకతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు!
జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ మంజూరు అయ్యిందన్న వార్త రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది కాబోతోంది. వివిధ రాజకీయ పార్టీల నేతలు జగన్ మోహన్ రెడ్డితో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు అందిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జగన్ మోహన్ రెడ్డి కృషి చేయాల్సిందిగా అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మధుసూదన్ గుప్తా విజ్ఞప్తి చేయడం విశేషం. ఒకే ఒక్క వ్యక్తి రాజకీయ సమీకరణాలనే మార్చేయబోతున్నారా? ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పై విడుదల కానున్న తరుణంలో కాంగ్రెస్ నేతల నుండి వస్తోన్న స్పందన చూస్తే అదే నిజమనిపిస్తోంది. సీమాంధ్రను అట్టుడికిస్తోన్న సమైక్య సమరాన్ని జగన్ మోహన్ రెడ్డి ముందుండి నడిపించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, గుంతకల్ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా కోరుతున్నారు. మధుసూదన్ గుప్తా ఒక్కరే కాదు వివిధ జిల్లాల కు చెందిన కాంగ్రెస్..టిడిపి నాయకులు జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పని చేయాలని ఆరాట పడుతున్నారు.తమకు అవకాశం ఇస్తే జగన్ మోహన్ రెడ్డితో కలిసి పని చేస్తామని వారు సంకేతాలు పంపుతున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మరింత వేగంగా అనూహ్యంగా మారడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. భావి రాజకీయ పరిణామాలన్నింటకీ జగన్ మోహన్ రెడ్డే కేంద్రబిందువుగా ఉంటారని వారు విశ్లేషిస్తున్నారు. -
రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ తప్పుచేసింది: మధుసూదన్‌గుప్తా
అనంతపురం: రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర జిల్లాల్లో ఒక్కసారిగా ఉద్యమ వాతావరణం నెలకొంది. జూలై 30వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సీడబ్ల్యూసీ తీర్మానం అనంతరం కేంద్రం తెలంగాణపై తమ నిర్ణయాన్ని ప్రకటించడంతో సీమాంధ్రలో ఉద్యమం రగులుకుంది. సీమాంధ్ర ప్రజలు సమైక్యాంధ్ర నినాదంతో కేంద్రం వైఖరిని నిరసిస్తూ అడుగుడుగునా ధర్నాలూ, నిరసనలు, ర్యాలీలతో అట్టడుకిపోతోంది. అక్కడి ప్రాంతీయ పార్టీలు కూడా ఉద్యమంలో పాల్గొని తమ మద్దుతును పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనపై ముందే సంకేతాలిచ్చినా ప్రజలు ఆలస్యంగా మేల్కొన్నరంటూ గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ తప్పుచేసిందని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబును ఎందుకు నిలదీయలేదని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్రుల అభిప్రాయాలను కాంగ్రెస్ పెద్దలు గౌరవించలేదని మధుసూదన్‌గుప్తా విమర్శించారు.