మూడు రంగులు... ఆరు రుచులు | independence day special sweets | Sakshi
Sakshi News home page

మూడు రంగులు... ఆరు రుచులు

Published Fri, Jan 24 2014 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM

independence day special sweets

గణతంత్రం... స్వేచ్ఛా పావురం.
 దేశభక్తి... త్యాగం, శాంతి, సౌభాగ్యాల త్రివర్ణం!
 
 సమరయోధులు స్వాతంత్య్రాన్ని తెచ్చారు.
 రాజనీతిజ్ఞులు రాజ్యాంగాన్నిచ్చారు.
 మన దేశం, మన పాలన, మన వేడుక.
 
 రేపు రిపబ్లిక్ డే.
 ప్రతి హృదయం నిండా... మూడు రంగులే.
 మనకు మాత్రం...
 మూడు రంగులతో పాటు... ఆరు రుచులు.
 హ్యాపీ రిపబ్లిక్ డే!
 

 తిరంగా ఇడ్లీ
 
 కావలసినవి:
 ఇడ్లీపిండి - అరకేజీ, క్యారట్ తురుము - కప్పు, కొత్తిమీర పేస్ట్ - కప్పు, పోపు - టీ స్పూను
 
 తయారి:  
 ఇడ్లీ పిండిని మూడు భాగాలుగా చేసుకుని, ఒక భాగంలో క్యారట్ తురుము, ఒక భాగంలో కొత్తిమీర పేస్ట్ వేసి కలపాలి. ఒక భాగం అలాగే ఉంచేయాలి  
 
 ఈ మిశ్రమాన్ని గుండ్రంగా ఉండే మూడు బాక్స్‌లలో విడివిడిగా వేసి, కుకర్‌లో ఉంచి, ఆవిరి మీద ఉడికించాలి  
 
 మూడిటినీ వరుసగా ఒక ప్లేట్‌లో ఉంచి, పోపుతో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి.
 
 తిరంగారవియోలి

 
 కావలసినవి:
 కార్న్‌ఫ్లోర్ - 50 గ్రా., టొమాటో తరుగు - అర కప్పు, రెడ్ క్యాప్సికమ్ పేస్ట్ - 50 గ్రా., వెల్లుల్లి తరుగు - టీ స్పూను, చీజ్ తురుము - 20 గ్రా., ఆలివ్ ఆయిల్ - 10 మి.లీ., తులసి ఆకులు - 5 గ్రా., పుదీనా పేస్ట్ - 50 గ్రా., మైదాపిండి - 150 గ్రా., పుదీనా పేస్ట్ - 50 గ్రా., నీరు - లీటరు, చెర్రీ టొమాటోలు - 4 (మధ్యకి కట్ చేయాలి)
 
 తయారి:
 ఒక పాత్రలో... :  కార్న్‌ఫ్లోర్, టొమాటో తరుగు, రెడ్ క్యాప్సికమ్ పేస్ట్, వెల్లుల్లి తరుగు, చీజ్ తురుము వేసి పక్కన ఉంచాలి (కాషాయరంగు)  
 
 కార్న్‌ఫ్లోర్, ఆలివ్ ఆయిల్ వేసి కలిపి పక్కన ఉంచాలి (తెలుపురంగు)  
 
 కార్న్‌ఫ్లోర్, తులసి ఆకులు, ఆలివ్ ఆయిల్, పుదీనా పేస్ట్ వేసి కలిపి ఉంచాలి (ఆకుపచ్చ రంగు)  
 
 మైదాను చపాతీపిండిలా కలిపి, చిన్నచిన్న ఉండలు చేసి, పల్చటి పూరీలా ఒత్తి, పొడవుగా రిబ్బన్‌లా కట్ చేయాలి  
 
 మూడురంగుల మిశ్రమాలను విడివిడిగా మూడు పొరలలో చుట్టి, మూడిటినీ కలిపి నలుచదరంగా వచ్చేలా కట్ చేసి, పైన కార్న్‌ఫ్లోర్‌తో బ్రష్ చేయాలి.  
 
 ఒక పాత్రలో నీరు, ఉప్పు వేసి మరిగించాలి  
 
 తయారుచేసి ఉంచుకున్న ‘రవియోలి’లను నీటిలో వేసి 5 నిముషాలు ఉంచి తీసేయాలి  
 
 చెర్రీ టొమాటోలతో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి.
 
 తిరంగా పాస్తా
 
 కావలసినవి:
 బటర్ - 2 టేబుల్ స్పూన్లు, మైదా -  2 టేబుల్ స్పూన్లు, పాలు - 100 మి.లీ., ఉప్పు - తగినంత, టొమాటో ప్యూరీ - 80 గ్రా. , టొమాటో కెచప్ - 2 టేబుల్ స్పూన్లు, తులసి ఆకులు - 10, పాస్తా - 80 గ్రా., నూనె - 50 గ్రా., వెల్లుల్లి రేకలు - 4, చీజ్ - 4 టేబుల్ స్పూన్లు, క్రీమ్ - 4 టేబుల్ స్పూన్లు, వైట్ సాస్ - 80 గ్రా., పుదీనాపేస్ట్ - 50 గ్రా., ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు.
 
 టొమాటో ప్యూరీ కోసం

 టొమాటోలు - 150 గ్రా., టొమాటో కెచప్ - 2 టేబుల్ స్పూన్లు
 
 తయారి:  
 పాస్తాను ఉడికించి మూడు భాగాలుగా చేసి పక్కన ఉంచాలి  
 
 పాన్‌లో బటర్ వేసి కరిగాక మైదా, చల్లటిపాలు వేసి కలిపాక ఉప్పు జత చేసి పక్కన ఉంచాలి  
 
 టొమాటో ప్యూరీ కోసం... టొమాటోల పై తొక్క తీసి, టొమాటోలను మిక్సీలో వేసి మెత్తగా చేసి, గిన్నెలో వేసి ఉడికాక, టొమాటో కెచప్, తులసి ఆకులు, ఉప్పు జత చేసి పక్కన ఉంచాలి
 
 పుదీనా ఆకులను మిక్సీలో వేసి మెత్తగా చేసి, పక్కన ఉంచాలి  
 
 గిన్నెలో నీళ్లు పోసి మరిగాక, పాస్తా వేసి ఉడికించి పక్కన ఉంచాలి  
 
 బాణలిలో నూనె వేసి కాగాక వెల్లుల్లి రేకలు, టొమాటో ప్యూరీ, క్రీమ్ వేసి ఉడికించాక, పాస్తా జత చేసి, పైన చీజ్ వేసి తీసేయాలి  
 
 అదే బాణలిలో ఆలివ్ ఆయిల్ కాగాక వెల్లుల్లి రేకలు, వైట్ సాస్, క్రీమ్, పాస్తా వేసి ఉడికించి దించేసి క్రీమ్‌తో గార్నిష్ చేయాలి  
 
 ఆలివ్ ఆయిల్ కాగాక వెల్లుల్లి రేకలు వేయించి, క్రీమ్, పుదీనా పేస్ట్ జత చేసి, కొద్దిగా ఉడికాక దించి చీజ్‌తో గార్నిష్ చేయాలి  
 
 మూడు రంగుల పాస్తాలను వరుసగా పేర్చి సర్వ్ చేయాలి.
 
 తిరంగా మౌసే
 
 కావలసినవి:
పాలు - టేబుల్ స్పూను, వైట్ చాకొలేట్ - 20 గ్రా., చిక్కగా చిలికిన క్రీమ్ - 150 మి.లీ., ఆరెంజ్ ప్యూరీ - 20 గ్రా., కివీ ప్యూరీ - 20 గ్రా.
 
 తయారి:  
 ఒక పాత్రలో పాలు, వైట్ చాకొలేట్ వేసి కరిగించాలి  
 
 క్రీమ్‌ను మూడు భాగాలుగా చేసి పక్కన ఉంచాలి  
 
 క్రీమ్‌లో ఒక్కో భాగానికి ఆరెంజ్ ప్యూరీ, కివీ ప్యూరీ, కరిగించిన వైట్ చాకొలేట్ విడివిడిగా జతచేయాలి  
 
 ఒక గ్లాసులో ఈ మిశ్రమాలను వరుసగా పోసి సుమారు రెండు గంటలసేపు ఫ్రిజ్‌లో ఉంచాక, చల్లగా సర్వ్ చేయాలి.
 
 తిరంగా కుల్ఫీ
 
 కావలసినవి:
 చిక్కటిపాలు - ఒకటిన్నర లీటర్లు, బాదంపప్పు - 2 టేబుల్ స్పూన్లు, పిస్తా తరుగు - టేబుల్ స్పూను, ఏలకులపొడి - 5 గ్రా., కుంకుమపువ్వు - కొద్దిగా, ఖస్ సిరప్ - 2 టేబుల్ స్పూన్లు (సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది), క్రీమ్ - 3 టేబుల్ స్పూన్లు
 
 తయారి:  
 మందంగా ఉండే వెడల్పాటి పాత్రలో పాలు పోసి మరిగాక, మంట తగ్గించి, పాలు చిక్కబడి సగం అయ్యేవరకు కలుపుతూ ఉండాలి  
 
 బాదంపప్పులు, పిస్తా తరుగు, ఏలకులపొడి జత చేసి మరోసారి కలిపి దించేయాలి  మూడు భాగాలుగా విభజించి, ఒక భాగానికి కుంకుమపువ్వు, ఒక భాగానికి ఖస్ సిరప్, ఒక భాగానికి క్రీమ్ జతచేసి కుల్ఫీ మౌల్డ్‌లో వరుసగా పోసి కవర్ చేసి ఫ్రిజ్‌లో సుమారు ఆరు గంటలు ఉంచాక, సర్వ్ చేయాలి.
 
 తిరంగా వెజిటబుల్ పులావ్
 
 కావలసినవి:
 కార్న్‌ఫ్లోర్ - 50 గ్రా., టొమాటో తరుగు - అర కప్పు, రెడ్ క్యాప్సికమ్ పేస్ట్ - 50 గ్రా., వెల్లుల్లి తరుగు - టీ స్పూను, చీజ్ తురుము - 20 గ్రా., ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, తులసి ఆకులు - 5 గ్రా., పుదీనా పేస్ట్ - 50 గ్రా., మైదాపిండి - 150 గ్రా., పుదీనా పేస్ట్ - 50 గ్రా., నీరు - లీటరు, చెర్రీ టొమాటోలు - 4 (మధ్యకి కట్ చేయాలి)
 
 తయారి:
 ఒక పాత్రలో... :  కార్న్‌ఫ్లోర్, టొమాటో తరుగు, రెడ్ క్యాప్సికమ్ పేస్ట్, వెల్లుల్లి తరుగు, చీజ్ తురుము వేసి కలిపి పక్కన ఉంచాలి (కాషాయరంగు)  
 
 కార్న్‌ఫ్లోర్, ఆలివ్ ఆయిల్ వేసి కలిపి పక్కన ఉంచాలి (తెలుపురంగు)  
 
 కార్న్‌ఫ్లోర్, తులసి ఆకులు, ఆలివ్ ఆయిల్, పుదీనా పేస్ట్ వేసి కలిపి ఉంచాలి (ఆకుపచ్చ రంగు)  
 
 మైదాను చపాతీపిండిలా కలిపి, చిన్నచిన్న ఉండలు చేసి, పల్చటి పూరీలా ఒత్తి, పొడవుగా రిబ్బన్‌లా కట్ చేయాలి  
 
 మూడురంగుల మిశ్రమాలను విడివిడిగా మూడు పొరలలో చుట్టి, మూడిటినీ కలిపి చతురస్రంగా వచ్చేలా కట్ చేసి, పైన కార్న్‌ఫ్లోర్‌తో బ్రష్ చేయాలి  
 
 ఒక పాత్రలో నీరు, ఉప్పు వేసి మరిగించాలి  
 
 తయారుచేసి ఉంచుకున్న ‘రవియోలి’లను నీటిలో వేసి 5 నిముషాలు ఉంచి తీసేయాలి  
 
 చెర్రీ టొమాటోలతో గార్నిష్ చేసి, సర్వ్ చేయాలి.
 
 సేకరణ
డా. వైజయంతి

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement