
ఆదియోధులు - అజరామరులు
ఈ దేశం గుర్తించని, తనలోని మరో ప్రపంచం - ఆదివాసీ సమాజం. ఈ దేశంలో అన్ని కాలాలలో అందరికన్నా ఎక్కువ దోపిడీకి గురైంది వీళ్లే. అందరికన్నా ఎక్కువగా ప్రతిఘటించింది, ఎక్కువమంది ప్రాణార్పణ చేసింది ఆదివాసులే. వీరే మన ఆదియోధులు. వీరే మన పోరాట సంప్రదాయ మార్గదర్శకులు.
అనాది కాలం నుండి జీవన పోరాటం చేస్తూ, ప్రకృతి శక్తులపై విజయం సాధిస్తూ మనుగడ సాగించిన వారసత్వం వారిది. కల్లాకపటం ఎరుగని మైదాన వ్యవస్థలన్ని వారిని దోపిడీ చేయడానికి, అణచివేయడానికి చూస్తూనే వున్నారుు. ఈ అణచి వేత రోజురోజుకి పెరిగిపోరుు ఇప్పుడు తారాస్థారుుకి చేరింది. వారిని అణచివేయడానికి ముందు వారి విశ్వాసాలపై, సంస్కృతిపై యుద్ధం ప్రకటిస్తున్నారు.
ఆదివాసీ నేల నేడొక ప్రయోగశాల. అన్ని మతాలు వారిని సమానంగా అనేక ప్రలోభాలకు గురి చేసి వారిని వారికి కాకుండా చేస్తున్నాయి విచిత్రం ఏమంటే అలా కొత్తగా మారిపోరుునవారు ఆదివాసీ తెగలవారికి కొరకరాని కొయ్యలవుతున్నారు. వారు తమని తాము ఆదివాసులుగా పిలుచుకుంటూ, తమ పేర్లు మార్చుకుని, తమ స్వభావాలు మార్చుకొని, తమ చేతిలో ఇతరే తర మతగ్రంధాలను పెట్టుకొని, వాటిని మెదళ్లలో కూర్చుకొని తమ సొంత సోదరులకు వ్యతిరేకులవుతున్నారు. వారి పక్షం వహించినట్లుగా నటిస్తూ వారి రాబోయే ప్రయోజనాలకు అడ్డు నిలుస్తున్నారు. కేవలం ఆదివాసి సంస్కృతిని రూపుమాపడానికి వీరు పరాయీకరణకు లోనైన కారణంచేత కొందరు అసలు సిసలైన ఆదివాసుల ప్రయోజనాలకు అడ్డు పడుతున్నారు. ఇది ఒక పెద్ద కనపడని కుట్రలో భాగం. ముప్పాతిక భాగం గిరిజనే తరులు, ఒక భాగం గిరిజనుల పేరుతో గిరిజనులను వంచించే ప్రయత్నం జరుగుతోంది. వర్తమాన కాలంలో కొనసాగుతున్న తంతు ఇది.
వీర స్మరణ లేని జాతి శుష్కిస్తుంది. చేతనలేని సమాజం ముందుకు సాగదు. మీద పడుతున్న ప్రమాదాలను గుర్తించలేదు. గుర్తించికూడా పట్టించుకోదు. కాబట్టి అలా జాతి నిర్వీర్యమవు తుంది. అలా స్తబ్దతకు గురికాకుండా అమరవీరులు తమ తెగలను చైతన్యవంతులుగా చేస్తారు.
సగటు మనిషి జీవిత గమనంలో పోరాటం తప్పనిసరి. పోరాడాలి - కాని మన కోసం కాదు. గెలవాలి- కేవలం మన కోసం కాదు. మన ముందు తరాలను బతికించడానికి పోరా టంలో గెలిచినా , చివరికి ఓడినా దాని లక్ష్యం మాత్రం మారదు. చరిత్రలో అది సుస్థిరంగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఇవన్నీ చరిత్రలో మన పోరాట యోధులు నిరూపించిన నిత్యసత్యాలు . వారి త్యాగాలను, ఆ స్పూర్తిని నిలబెట్టుకోవాలంటే అలాంటి చరిత్రకు భవిష్యత్తుగా నిలవాలంటే మహాయో ధులను, చరిత్రకారు లను ఒక్కసారి స్మరించు కోవాల్సిందే. లేకపోతే డా.అంబేడ్కర్ చెప్పి నట్లు ‘చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే, చరిత్ర మనకు గుణ పాఠం నేర్పుతుంది’. కాబట్టి చరిత్రనుంచి పాఠాలు నేర్చుకుంటూ మన అస్తిత్వం, ఆత్మగౌరవం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
నేడు సామాజిక న్యాయం, రాజ్యాధికారం కోరుకుంటున్న అన్ని అణగారిన వర్గాల ప్రజల్లో ఆదిమవాసులది ప్రథమస్థానం. గత 69 ఏళ్ల స్వాతంత్య్ర భారత్ నుంచి నేటి నవ తెలంగాణ వరకు ఆదివాసులు ఇంకా దుర్భర జీవితమే గడుపుతున్నారు. రాజ్యాం గంలో ఆదివాసి గిరిజనులకు పొందుపర్చిన ప్రత్యేక హక్కులు, చట్టాలు, రిజర్వేషన్లు పూర్తిగా అమలు కావడానికి ఇంకా ఎదురు చూపే మిగిలింది. స్వజాతి పౌరునిగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా నైనా ఆదివాసి గిరిజనుల్లో కొంత చైతన్యం కలిగించడానికి చిన్న ప్రయత్నంగా గుమ్మడి లక్షీ్ష్మనారాయణ చేసిన అక్షర సమరమే ‘ఆదియోధులు అజరామరులు’.
బిర్సాముండా, రాంజీ గోండు, అల్లూరి సీతారామరాజు, గంటందొర, కొమురం భీమ్ వంటి యోధుల పోరాట ఫలితంగా, హైమండార్ఫ్ పరిశోధనల అనంతరం, డా. అంబేడ్కర్ భారత రాజ్యాంగంలో 5,6 షెడ్యూళ్ల ద్వారా ప్రత్యేకమైన హక్కులు, చట్టాలు, రిజర్వేషన్లు రూపొందించారు. అటువంటి మహా యోధుల త్యాగ ఫలాలను అనుభవిస్తున్న ప్రస్తుత తరం వారి చారిత్రక పోరాట జీవిత విషయాలను మననం చేసుకొని, అదే స్పూర్తితో ఆదిమజాతిని మేల్కొల్పడమే ఈ పుస్తక లక్ష్యం.
బ్రిటిష్, నైజాం కాలం నుంచీ పోరాట పటిమ కలిగి.. వీరో చిత చరిత్ర సృష్టించిన గిరిజన ఆదివాసులు నేడు విష జ్వరాలతో, రక్తహీనత, పౌష్టికాహార లేమితో పిట్టల్లా రాలిపోతున్నారు. తెలం గాణ పునర్నిర్మాణంలో ఆదివాసీల ప్రాణాన్ని, వారి ఉనికిని కాపా డితేనే బంగారు తెలంగాణ అస్థిత్వానికి, దాని భవిష్యత్తుకు నిజ మైన పునాది ఏర్పడుతుంది.
(నేడు హన్మకొండలోని భాషా నిలయంలో ఆదివాసీ రచయితల వేదిక ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు గుమ్మడి లక్ష్మీనారా యణ రచించిన ‘ఆదియోధులు అజరామరులు’ పుస్తక ఆవిష్కరణ సభ జరుగనుంది. ముఖ్య అతిధి ప్రొపెసర్ జయధీర్ తిరుమలరావు. గౌరవ అతిథి జీవన్ కుమార్, అతిధులు ప్రొఫెసర్ ఈసం నారాయణ. నల్లెల్ల రాజయ్య. అందరూ ఆహ్వానితులే)
అన్వర్, కవి, ఆదివాసీ ఉద్యమకారుడు, తెలంగాణ రచయితల వేదిక మొబైల్ : 986606 89066