ప్రగతికి తర్కం ప్రధానం | chukka ramaiah sandarbam | Sakshi
Sakshi News home page

ప్రగతికి తర్కం ప్రధానం

Published Sat, May 7 2016 3:28 AM | Last Updated on Sun, Sep 3 2017 11:32 PM

ప్రగతికి తర్కం ప్రధానం

ప్రగతికి తర్కం ప్రధానం

సందర్భం:
మిలటరీ కోసం ఖర్చు చేయటం కంటే ప్రజల ఆలోచనా పద్ధతుల్లో రావాల్సిన మార్పులపై దేశాలు దృష్టి సారిస్తున్నాయి. హేతుబద్ధత అన్నది ప్రశ్నించటానికి మూలం అవుతుంది. ఏ మతమైతే ఇతరుల భావనలను ఎదగనీయదో అక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా ఎదగదు.

1960లో విజ్ఞాన శాస్త్రంలో వచ్చిన ఆవిష్కరణలు మానవ సమాజంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిం చాయి. ప్రజలలో నూతన ఆలోచనలు రేకెత్తించాయి. కొన్ని దేశాలు అన్ని రంగాల్లో ఎలా విజయవంతంగా ముందుకు దూసుకుపోతున్నాయి? మరికొన్ని దేశాలు ఎందుకు వెనుకబడిపోతున్నాయి? దీనికి కార ణం ఏమిటిదని ఆలోచనలు మొదలయ్యాయి. కొన్ని దేశాల అభివృద్ధి ఎందుకంత మందకొండిగా ఉందని ఆర్థికవేత్తలు లారెన్స్ హరిసన్, షాంబెల్ హల్టింగ్‌సన్‌లు అనేక పరిశోధ నలు చేశారు. ఒకదేశం నాగరికత కూడా ఆ దేశ ఆర్థిక ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుందని వీరు సూత్రీకరించారు.

నాగరికత, సంస్కృతి అంటే ఏమిటో చాలా మందికి స్పష్టత ఉండదు. నాగరికత అంటే జాతీయత మాత్రమే కాదు. జాతి బృందాలు మాత్రమే కాదు. నాగరికత అంటే మతం కూడా కాదు. మూఢవిశ్వాసాలు అంతకంటే కాదు. జాతీయత, రంగు, ప్రదేశము, మతము యొక్క సమగ్ర రూపమే సంస్కృతి. ఒక దేశం ఆర్థిక ఎదుగుదలకూ లేదా వైఫల్యానికీ ఆ దేశ సంస్కృతే కారణభూతమౌతుంది. సంస్కృతి ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అది నిత్యం పరిభ్ర మిస్తూ ఉంటుంది. మారుతూ ఉంటుంది.

 ఇంగ్లాండు, ఐర్లాండ్‌లు ఒక దేశంలోని భాగాలు, ఐర్లాండ్ ప్రగతిలో మందకొడి తనాన్ని ఇంగ్లాండ్ తరుచుగా హేళన చేసేది. ఐర్లాండ్‌లో కరు వుకు కారణం అక్కడివారి సోమరితనమే అని సామెతలుగా బ్రిటిష్‌వాళ్లు చెప్పేవారు. ఐర్లాండు అంటే ఉడకబెట్టిన ఆలుగడ్డలు అని కూడా వ్యాఖ్యా నించేవారు. కూర్చుని తింటే కరువులు ఎందుకు రావు అని ఆనాడు విన్‌స్టన్ చర్చిల్ వ్యాఖ్యానించారు. బ్రిటిష్ హయా ములో మనదేశ ప్రజలు కూడా కూర్చుని తినటం వల్లనే కరువులు వచ్చాయన్నారు.

 కానీ, 1970లో యూరప్‌లో అన్ని దేశాలకంటే ఐర్లాండ్ జీడీపీ బాగా పెరిగింది. అదే భారతదేశంలో 1973లో ఆహార కరువు వచ్చింది. నాగరికత ప్రభావం కూడా ఎప్పుడూ స్థిరం గా ఉండదు. ఉదాహరణకు దక్షిణ కొరియా, ఆఫ్రికాలోని థానా ఆర్థిక పరిస్థితి 1960ల వరకు ఒకే రకంగా ఉండేది. కానీ థానా అభివృద్ధి మందకొడిగా ఉంది. సౌత్‌కొరియా ఆర్థిక వ్యవస్థ భేషుగ్గా ఉన్నదని ఆర్థిక శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ వ్యాపారంలో దక్షిణ కొరియా వేగవంతంగా అభివృద్ధి చెందింది. గ్రీసుదేశాన్ని దాటిపోయింది. ఈ ఎదుగుదలకు ఆ దేశాల సంస్కృతి, నాగరికతే కారణమని పలువురు ఆర్థికవేత్తల వ్యాఖ్యానం.

 ప్రధానంగా బౌద్ధమతం, సౌత్‌కొరియా ఆలోచనా విధానాన్ని మార్చివేసింది. జసాన్, సౌత్‌కొరియా, ఐర్లాండ్, శ్రీలంక దేశాలలో బౌద్ధమతం వలన విద్యావ్యాప్తి వేగంగా జరిగింది. ఇతర మతాలు విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి. బౌద్ధమతంలో గ్రంథాలు చదవటమే ప్రధానం. అధ్యయనం ముఖ్యమైనది. అందుకే జపాన్‌లో 16వ శతా బ్దంలోనే సంపూర్ణ అక్షరాస్యతను సాధించారు. మత గ్రంథాలు ప్రమాణం కాబట్టి ఆ గ్రంథాలను చదవటమే బౌద్ధ మతం విస్తృత ప్రచారానికి ప్రధాన కారణం.

 బౌద్ధమతానికి తర్కం ప్రధానం కాబట్టి ఆ దేశాల యొక్క అభివృద్ధికి అదే కారణమైందని పలువురు ఆర్థికవేత్తలు విశ్లేషించారు. జపాన్ దేశంలో అమెరికా కన్నా రెండున్నర రెట్లు అధికంగా పుస్తకాలు ముద్రించబడ్డాయి. జపాన్ అభివృద్ధి వెనుక అక్కడ నెలకొన్న బౌద్ధమతం, పుస్తకాలే కారణం. అంటే మతం, నాగరికత కూడా ఎలా అభివృద్ధికి దోహదపడతాయో జపాన్, ఐర్లాండ్ లాంటి దేశాలు తెలియజేస్తున్నాయి.

 కొన్ని దేశాలను కర్మ సిద్ధాంతం కుంగదీసింది. కేవలం దైవానుగ్రహంపైన అభివృద్ధి ఆధారపడి ఉంటుందని కొన్ని దేశాలు భావించాయి. మతమౌఢ్యాలు బలంగా వున్న దేశా లలో ప్రతి దానికి మతమౌఢ్యమే ప్రధానమనుకునే భావనలో ఉన్నారు. శాస్త్రీయ చింతన లేకుండా అభివృద్ధి అసాధ్యం. మనిషి ఆలోచనే ఆ సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది. 21వ శతాబ్దంలో ఏ దేశమైనా గాని ప్రగతి సాధించాలంటే ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలి. ఆ మార్పు హేతుబద్ధంగా ఉండాలి. మౌఢ్యం సమాజాన్ని శాసిస్తోంది.

 రాజ్యాంగ నిర్మాణంలోనే సైంటిఫిక్ టెంపర్‌ను కలిగిం చాలని ఆనాడే నెహ్రూ చెప్పారు. మనిషి శ్రమ వెనుక ఆలోచనే ప్రధానం. ఆలోచనపైన సంస్కృతి ప్రభావం ఎక్కు వగా ఉంటుంది. 21వ శతాబ్దంలో మిలటరీ కోసం ఖర్చు చేయటం కంటే ప్రజల ఆలోచనా పద్ధతుల్లో రావాల్సిన మార్పులపై దేశాలు దృష్టి సారిస్తున్నాయి.

 హేతుబద్ధత అన్నది ప్రశ్నించటానికి మూలం అవు తుంది. ఏ మతమైతే ఇతరుల భావనలను ఎదగనీయదో అక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా ఎదగదు. హేతుబద్ధత పెర గాలంటే అవగాహనాశక్తి పెరగాలి. అందుకే మన రాజ్యాంగంలో మొదటి వాక్యంలోనే దేశం భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్ణయమవుతుందన్నారు. తరగతి గది అంటే గోడలు కావు. దాని వెనుక రేకెత్తించే ఆలోచనలున్నాయి.
http://img.sakshi.net/images/cms/2015-03/41426188468_295x200.jpg
 వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు
 చుక్కా రామయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement