
గ్రహం అనుగ్రహం 06 జనవరి 2016, బుధవారం
శ్రీ మన్మథనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం, తిథి బ.ద్వాదశి పూర్తి
నక్షత్రం విశాఖ ఉ.6.20 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం ఉ.10.40 నుంచి 12.19 వరకు
దుర్ముహూర్తం ప.11.43 నుంచి 12.33 వరకు
అమృతఘడియలు రా.8.44 నుంచి 10.24 వరకు
సూర్యోదయం : 6.36
సూర్యాస్తమయం : 5.36
రాహుకాలం : ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు
భవిష్యం
మేషం: మిత్రులతో కలహాలు. ప్రయాణాలలో మార్పులు. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు కలసిరావు. దైవదర్శనాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
వృషభం: ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక ప్రగతి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.
మిథునం: బాకీలు వసూలు. భూ వివాదాలు పరిష్కారం. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు సానుకూలం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు.
కర్కాటకం: శ్రమ తప్పదు. పనులలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో అకారణంగా వైరం. అనారోగ్యం. వ్యాపార,ఉద్యోగాల్లో నిరుత్సాహం.
సింహం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఇంటా బయటా సమస్యలు వేధిస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాల్లో ఒత్తిడులు.
కన్య: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
తుల: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. దూర ప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో మాట పట్టింపులు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
వృశ్చికం: పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితి నెలకొంటుంది.
ధనుస్సు: శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రులతో కలహాలు పెరిగే అవకాశం ఉంది. రుణ యత్నాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.
మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. దూరపు బంధువుల కలయిక. వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
కుంభం: ఉద్యోగ యోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.
మీనం: కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులు, మిత్రులతో విభేదాలు రావచ్చు. అనుకోని ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
- సింహంభట్ల సుబ్బారావు