మచ్చలేని ఎన్నికల వ్యవస్థ
విశ్లేషణ
మన ఎన్నికలు సాధ్యమైనంత సక్రమంగానే సాగుతాయి. అయినా ఓడిపోయిన వారు ఈవీఎంలలో దగా జరిగిందని అంటుంటారు. అవి నీతి, అధ్వాన పాలన అలవాటైన మనం మంచిని గుర్తించలేమేమో.
ఉత్తరప్రదేశ్ ఎన్నిక లపై జరిపిన ఒక ఎగ్జి్జట్æపోల్ బీజేపీకి మెజారిటీ లభిస్తుం దని చెప్పిన విషయం తెలిసిందే. యూపీకి చెందిన ఒక ట్యాక్సీ డ్రైవర్ అలా ముంద స్తుగా ఫలితాలను చెప్పగలిగారంటే ఈవీఎంలలోకి తొంగిచూడ టం సహా ఏదో ఒక మోసం జరిగినట్టేనని గట్టిగా నమ్మేశాడు. ఎగ్జిట్ పోల్స్‌ను ఎలా నిర్వహిస్తారనే క్రమాన్ని అర్థం చేసుకునే ఓపిక కూడా లే కుండా అదేదో మోసమేనని బలంగా వాదించాడు. అక్కడి తమ గ్రామంలోని మతపరమైన రాజ కీయాలకు అనుగుణంగా ఫలితాలు లేవు మరి. ఇది ఓడిపోయిన వాళ్ల వాదన. యూపీలో మాయావతి, ముంబైలో ఘోర పరాజయానికి గురైన మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి ఇదే వాదన చేశారు. తమ ఓటమికి తామే కారణ మని గుర్తించలేకపోతే, తప్పులు మరెక్కడో ఉన్నాయంటూ అందుకు ఆధారాలను సృష్టిం చాల్సి వస్తుంది. ఇది, ఫలితాలను అంగీకరించ లేని అధ్వాన నాయకత్వపు లక్షణం.
ఐదు రాష్ట్రాల.. యూపీ, పంజాబ్, ఉత్తరా ఖండ్, మణిపూర్, గోవాలలో ఎన్నికల తదుపరి ఎస్పీ, ఎమ్‌ఎన్‌ఎస్ క్యాడర్లు మళ్లీ ఈవీఎంలను తప్పుపడుతూ, ఈవీఎంల బొమ్మలను తగుల బెట్టి హోలీ జరుపుకున్నారు. ప్రజల దృష్టిలో సామంజస్యాన్ని సాధిస్తూ బీజేపీ భారీ విజ యాలతో ముందుకు సాగుతోంది. దీంతో ఈవీ ఎమ్‌లలోని ఫలితాలను తారుమారు చేయడ మనే భయం వ్యాపించింది. అయినా అలా జరి గిందని ఎవరు రుజువు చేసింది లేదు.
భారత్‌లో ఎన్నికలు సాధ్యమైనంత సజా వుగానే సాగుతాయి. నరనరాన అవినీతి జీర్ణిం చుకుపోయిన పాలనా వ్యవస్థ నుంచే ఎన్నికల కమిషన్ ప్రధానంగా తన ఎన్నికల నిర్వహణ సిబ్బందిని సమకూర్చుకుంటుంది. పోలింగ్ బూత్ స్థాయి పోలింగ్ అధికారుల నుంచి రిట ర్నింగ్ అధికారులు, యంత్రాలకు కాపలా కాసే పోలీసుల వరకు అంతా అలాగే సమకూరు తారు. వారు, రోజువారీ పాలనా విధులలో కని పించని లక్ష్యశుద్ధిని, నిబద్ధతను ప్రదర్శిస్తారు.
ఎన్నికల కమిషన్ మాట చెల్లుబాటవు తుంది, అది తన ఉత్తర్వుల అమలుపై శ్రద్ధ చూపుతుంది. ఈవీఎంలను, ఆ తర్వాత ఓటరు గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టినప్పటి నుంచి బూత్‌ల స్వాధీనం పాత సంగతిగా మారి పోయింది. ఒకరి ఓటును మరొకరు వేయడం అరుదుగా తప్ప జరగడం లేదు. ఈసీ, ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినో లేక డీజీపీనో మార్చమని ఆదేశించినాగానీ, తక్షణమే దాన్ని అమలు చేయడం జరుగుతోంది. కేవలం ఎన్ని కల సమయంలోనే మన పాలనా యంత్రాం గంలో పనిచేస్తున్నవారి మంచి బయటకు వస్తుంది, అందువల్లనే వారా విధులను సక్ర మంగా నిర్వహిస్తారు. ఎన్నికల ప్రక్రియలో ఏదైనా వంచన అంటూ జరిగితే అది రాజకీయ నాయకుల వల్లనే జరుగుతుంది. నల్లధనం, లంచగొండితనం, బూటకపు వాగ్దానాలు వంటి తప్పుడు పనులన్నీ వారు చేసేవే. ఎన్నికలు సక్రమంగా జరగాలంటే కళ్లెం వేయాల్సింది వారికి మాత్రమే.
ఎన్నికల నిర్వహణను జవహర్‌లాల్ నెహ్రూ 1950లో సుకుమార్ సేన్‌కు అప్పగిం చారు. అప్పటికంటే నేడు అది మెరుగుపడింది. అప్పట్లో సేన్, నిరక్షరాస్య ఓటర్లకు అర్థమయ్యే ఎన్నికల చిహ్నాలను ఎంపిక చేయడం నుంచి అన్నీ చేయాల్సి వచ్చింది. ఎన్నికల ప్రక్రియను మెరుగుపరిచేలా మార్పులు, చేర్పులు చేయడ మనేది నిరంతర ప్రక్రియగా సాగుతూ ఉంది.
రాజకీయవేత్తలు తమ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధి కిందికి తెచ్చి, పార్టీల జవా బుదారీతనం విషయంలో మరింత పారదర్శక తను తేవడానికి తిరస్కరించాయి. ఎన్నికల కమి షన్ విచారించాల్సిన విషయం అదే. అవి అలా చేసి ఉంటే, ప్రత్యర్థి బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టి ప్రకటనలకు స్థలం నుంచి మీడియా (డబ్బు చెల్లించి వేయించుకునే వార్తలు), ఓట్లు వరకు ప్రతిదాన్నీ కొనేయడానికి నిధుల అందుబాటును తగ్గించగలుగుతాం. కానీ ఇందుకు రాజకీయ వ్యవస్థ నిరాకరిస్తుంది. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు ఓటమి పాలైన ప్పుడు మాత్రం ఈవీఎంలను తప్పుబడుతుం టుంది. అయితే, పైన పేర్కొన్న ట్యాక్సీ డ్రైవర్, దేశంలోని చాలా మందిలాగే తాము కోరుకున్న ఫలితాలు రావాలనే దానిపైనే దృష్టి పెడతాడు. అంతేగానీ, అనుమానానికి తావేలేని పరిశుద్ధ మైన వ్యవస్థను నిర్మించగలమని మాత్రం నమ్మడు. ఏ మోసానికి ఆస్కారం లేకుండా కూడా మన దేశంలో కొన్ని పనులు జరగవచ్చని తెలిస్తే హాయిగా ఉండదూ? అవినీతికి, అధ్వాన పాలనకు అలవాటుపడ్డ మనం మెరుగ్గా ఉన్న దాన్ని గుర్తించలేమేమో అనిపిస్తుంది.
- మహేష్ విజాపృకర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com